/rtv/media/media_files/2025/08/27/wife-pours-petrol-on-husband-and-sets-him-on-fire-2025-08-27-18-55-49.jpg)
Wife pours petrol on husband and sets him on fire
Crime News: ఏపీలోని డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రావులపాలెం మండలం గోపాలపురంలో భర్తపై పెట్రోల్ పోసి భార్య నిప్పంటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మట్ట శ్రీను, మట్ట ఏంజలీనా జెన్నీఫర్ థామస్ భార్య భర్తలు వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే కొంత కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో నిద్రపోతున్న మట్ట శ్రీను పై తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పంటించి తలుపుకు గడియ పెట్టింది. అయితే మంటల తాటికి తట్టుకోలేక శ్రీను కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి ఆయనను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భర్త ప్రతిరోజు తాగివచ్చి వేధించడంతో వేధింపులు తాళలేక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మట్టా శ్రీను పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఇది కూడా చూడండి:BIG BREAKING: వైష్ణోదేవి యాత్రలో తీవ్ర విషాదం.. 30 మందికి పైగా మృతి
ప్రేమించి పెళ్లి చేసుకుని..
నేపాల్‌కు చెందిన ఏంజిలీనా కెథలిక్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసింది. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కెథలిక్ పాఠశాలలో పనిచేస్తుండేది. సుమారు 12 సంవత్సరాల క్రితం ఆటో డ్రైవర్ గా పనిచేసిన మట్ట శ్రీనుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే మట్ట శ్రీను ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు. శ్రీను రోజు చిత్రవద చేస్తుండటంతో ఏంజిలీనా పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఏంజిలీనా స్థానికంగా పలు ప్రయివేటు పాఠశాలల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసింది. అయితే భర్త ఒత్తిడి మేరకు జీవనోపాధి కోసం 2023లో ఏంజిలీనా మస్కట్ వెళ్లింది. మరలా భర్త ఒత్తిడితోనే ఒక సంవత్సరంలో తిరిగి ఇంటికి చేరుకుంది. భర్త ప్రవర్తనతో రోజు ఇంట్లో గొడవలు అవుతున్నట్లు సమాచారం. కాగా ఏంజిలీనాను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: OG: ఓజీతో ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ?..