/rtv/media/media_files/2026/01/08/fotojet-2026-01-08-21-17-33.jpg)
KCR once again shows his generosity...helps poor students
KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ దండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరూ ఇంజినీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు ఇతర అవసరాలకు గాను ఆర్థికసాయం అందించి బడుగు బిడ్డలకు భరోసానిచ్చారు. బీటెక్ ఇంజనీరింగ్ చదువు పూర్తి కోర్సుకు ఫీజు చెల్లించడంతో పాటు.. విడివిడిగా చెక్కులు అందజేశారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/08/fotojet-2026-01-08t211636296-2026-01-08-21-18-13.jpg)
వివరాల ప్రకారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద రైతు చిన్రాజు సత్తయ్య ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మరణించాడు. ఆయన కుమారుడు నవీన్ స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో పేదరైతు పెద్దోళ్ల సాయిలు ప్రమాదవశాత్తూ కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. ఆయన కుమారుడు అజయ్ కూడా స్థానికంగా బీటెక్ చదువుతున్నాడు. అయితే తండ్రులు లేకపోవడంతో పీజులు చెల్లించడానికి ఇబ్బందిపడుతున్న విషయాన్ని పార్టీ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన వారిని చేరదీయడంతో పాటు వారి ఇంజనీరింగ్ చదువు పూర్తికాలపు ఫీజులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెల్లించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/08/fotojet-2026-01-08t21165795-2026-01-08-21-18-31.jpg)
అలాగే వారికి అవసరమయ్యే పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు వారికి విడివిడిగా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా "కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డా.. మీరు కష్టపడి గొప్ప స్థాయికి చేరుకోవాలి. ఫీజుల కోసం భయపడొద్దు. ఏ సమస్య వచ్చినా నేనున్నా.." అంటూ భరోసా నిస్తూ కేసీఆర్ వారిని ఆశీర్వదించారు. కాగా.. విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధిత విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కేసీఆర్ గారు ఆదేశించారు.
కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, ఆర్థికంగా ఆదుకుని, తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన కేసీఆర్ గారికి పిల్లల తల్లులు చేతులెత్తి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. తమ చదువుకోసం భరోసాగా నిలిచిన కేసీఆర్ కు ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, కేసీఆర్ ఉద్యమ సమయంలోనే కాకుండా రాష్ర్ట ముఖ్యమంత్రిగా కూడా అనేకసార్లు పలువురు విద్యార్థులకు ఆర్థికసాయం అందించారు. అనేకమందిని దత్తతతీసుకుని వారి చదువులు పూర్తయ్యేలా ప్రోత్సహించారు. ఆయన బాటలోనే తనయుడు కేటీఆర్ సైతం పలువురికి ఆర్థికసాయం చేసి వారి చదువులు మధ్యలో ఆగిపోకుండా ఆదుకున్నారు.
Follow Us