BIG BREAKING: ఢిల్లీలో 6 గురు ఎంపీల సీక్రెట్ మీటింగ్.. TBJPలో అసలేం జరుగుతోంది?

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లిన తెలంగాణ బీజేపీ ఎంపీలంతా ఒకే దగ్గర సమావేశం అయ్యారు. అయితే ఇందులో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు లేకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

New Update

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లిన తెలంగాణ బీజేపీ ఎంపీలంతా ఒకే దగ్గర సమావేశం అయ్యారు. అయితే ఇందులో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు లేకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘనందన్ రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. గోడం నగేష్ ఉన్నారు. అయితే ఇందులో ధర్మపురి అర్వింద్ తప్పా మిగితా నాయకులంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచే బీజేపీలోకి వచ్చిన వారే. అంతేకాకుండా వీరిలో చాలామంది కూడా  బీజేపీ అధ్యక్ష్య పదవిని ఆశించిన వారే కావడం విశేషం.  

Also Read :  రేప్ చేశాడని కేసు పెట్టిన యువతికి దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు!

బండి సంజయ్ vs ఈటల రాజేందర్

ఇక తెలంగాణ బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల పంపిణీ, పార్టీలో ప్రాధాన్యత విషయంలో ఈ వివాదం మొదలైంది. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా హుజూరాబాద్‌లో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఈటల రాజేందర్ అనుచరులకు సమాచారం ఇవ్వకపోవడం,  వ్యక్తి పూజలు చేస్తే టికెట్లు ఇవ్వబోమని బండి సంజయ్ పరోక్షంగా ఈటల వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. 

Also Read :  ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!

అయితే దీనికి ప్రతిస్పందనగా ఈటల రాజేందర్ తన అనుచరులతో సమావేశమై, స్థానిక ఎన్నికల్లో తమ వాళ్లకు టికెట్లు ఇవ్వకుంటే హుజూరాబాద్‌లో ప్రతి ఊరిలో తమ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారని హెచ్చరించారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఈటల ఓటమికి కొందరు పార్టీ నేతల వ్యవహారశైలి కూడా ఒక కారణమని బండి సంజయ్ ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఈటల తీవ్రంగా స్పందిస్తూ, "నా చరిత్ర తెలవదు కొడకా!", "నీతిగల వారితో ధైర్యంగా పోరాడతాను గానీ కుట్రగాళ్లతో కాదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం బీజేపీ హైకమాండ్‌కు చేరింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఈ అంశంపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా  రాంచందర్‌రావు బాధ్యతలు చేపట్టాక   కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు  హాజరు కాగా మిగితా ఎంపీలు హాజరు కాకపోవడంతో బీజేపీలో అంతర్గత విభేదాలున్నాయన్న చర్చకు దారితీసింది.  

Also Read :  ఢిల్లీలో 6 గురు ఎంపీల సీక్రెట్ మీటింగ్.. TBJPలో అసలేం జరుగుతోంది?

Also Read :  దారుణం.. బర్త్‌డే రోజునే భర్త  చంపేశాడు...గొంతుకోసి!

telangana | telangana-bjp | bjp | telugu-news

Advertisment
తాజా కథనాలు