/rtv/media/media_files/2024/12/02/BQ4hQnxuPzmeV7s3eydp.jpg)
ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్‌లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఆదివారం ఉదయం ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రివరకు కూడా రాకపోవడంతో సిబ్బంది చూసినట్లు తెలిసింది.
Also Read: ISRO: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం
సోమవారం ఉదయం ఫెరిడో రిసార్ట్ సిబ్బంది వెళ్లి చూడగా రూంలో విగత జీవిగా ఎస్సై కనిపించాడు. దీంతో ఫెరిడో సిబ్బంది విషయాన్ని వెంటనే వాజేడు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. ఎస్సై సూసైడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపుతోంది. ఎస్సై హరీష్ ఆత్మహత్యకు ఎన్‌కౌంటర్‌కు ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు హరీష్ సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: AP: ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్ ఎమోషనల్ ట్వీట్
Wazeedu SI Committed Suicide
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్య
— Telugu Scribe (@TeluguScribe) December 2, 2024
సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సై
నిన్న మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎస్సై సూసైడ్ చేసుకోవడంతో కలకలం
గత నెలలో ఈయన విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫార్మర్స్ నెపంతో మావోయిస్టులు… pic.twitter.com/74EvI8TWe2
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలా లేక పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా
ములుగు జిల్లా వాజేడులో ఆదివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ జరిగిన గంటల వ్యవధిలోనే ఎస్ఐ అనుమానస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి.