Ponnala Lakshmaiah: KCRకు బిగ్‌షాక్.. BRSను వీడనున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య!

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు పార్టీని వీడుతున్నారని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

New Update
ponnala laxmaiah

బీఆర్ఎస్(brs) పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(ponnala-lakshmaiah) కారు పార్టీని వీడుతున్నారని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ(congress-party) లో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌లో చేరేముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు. కాంగ్రెస్ పార్టీ పీసీసీగా కూడా పని చేశారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలంటూ సోషల్‌ మీడియాలో పొన్నాల అభిమానుల పోస్టులు పెడుతున్నారు.

Also Read :  మందు బాబులకు పిచ్చేక్కించే ఆఫర్.. కూపన్ కొంటే గోట్, కాటన్ బీర్లు ఫ్రీ.. ఎక్కడంటే?

Ponnala Lakshmaiah Is Joining Congress Party

2023అసెంబ్లీ ఎన్నికల ముందు పొన్నాల బీఆర్ఎస్‌లో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు పొన్నాల లక్ష్మయ్య దూరంగా ఉంటున్నారు. ఆయన సొంతగూడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పొన్నాల చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక తొలి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అక్టోబర్ 13న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి BRSపార్టీలో చేరారు.

తన సొంత నియోజకవర్గం జనగామ నుండి టికెట్ దక్కే అవకాశం లేకపోవడం, పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించడం, కొంతమంది నాయకుల కారణంగా పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేయడం రాజీనామాకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.

జనగామలో జరిగిన సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన BRSపార్టీలో చేరారు.

Also Read :  మద్యం లారీలో మంటలు.. బాటిళ్లు పట్టుకుని పరుగో పరుగు

Advertisment
తాజా కథనాలు