Telangana Floods: వరద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు.. రూ.558.90 కోట్ల నష్టం
తెలంగాణలో భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాటిల్లిన నష్టంపై శాఖల అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నారు. 28 జిల్లాల్లోని 270 మండలాల్లో పంట నష్టం చోటుచేసుకుంది. కామారెడ్డిలో వరదల కారణంగా రూ.130 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.