Telangana Women's Commission : శ్రీవర్షిణి కి షాక్...అఘోరీ శ్రీనివాస్‍ అరెస్ట్ ?

అఘోరీ శ్రీనివాస్‍ పై తెలంగాణ మహిళా కమిషన్‍కు ఫిర్యాదు అందింది. శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో... అఘోరీ తన భర్త అంటూ మరో స్త్రీ బయటకు వచ్చింది. లేడీ అఘోరీ అలియాస్​ శ్రీనివాస్ మోసం చేశాడని ఆ యువతి మహిళా కమిషన్‌ కు ఫిర్యాదు చేసింది.  

New Update
Victims file complaint with Women's Commission

Victims file complaint with Women's Commission

Telangana Women's Commission : రెండు తెలుగు రాష్ర్టాల్లో నిత్యం వార్తల్లో నిలుస్తున్న లేడీ అఘోరీ శ్రీనివాస్‍ పై తెలంగాణ మహిళా కమిషన్‍కు ఫిర్యాదు అందింది. ఇప్పుడు శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో... అఘోరీ తన భర్త అంటూ మరో స్త్రీ బయటకు వచ్చి అందరి షాక్‌ కు గురి చేసింది.  లేడీ అఘోరీ అలియాస్​ శ్రీనివాస్​ పై ఓ మహిళ రాణిగంజ్​ బుద్దభవన్​ లో మహిళా కమిషన్‌ కు ఫిర్యాదు చేసింది.  కరీంనగర్​ కు చెందిన రాధిక అనే అమ్మాయి తనను అఘోరీ గతంలో  పెళ్లి చేసుకున్నాడని  మహిళా కమిషన్​ కు ఆమె ఫిర్యాదు చేసింది. గతంతో తనతో శారీరక సంబంధం పెట్టుకొని మహిళా అఘోరీగా మారిన శ్రీనివాస్ తనను వదిలేసి.. ఇప్పుడు మరో మహిళ జీవితాన్ని నాశనం చేసేందుకు ఒడిగట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.   

Also Read : ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

అఘోరి శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో వాడుకుని వదిలేశాడంటూ కమిషన్ ఎదుట భాదితురాలు వాపోయింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, సోమవారం నాడు వర్షిణి అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.అమాయక మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అఘోరీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. పెళ్లైన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని అఘోరీ బెదిరిస్తున్నాడని వాపోయింది.తనతో జరిగిన పెళ్లి విషయం.. శారీరక సంబంధం గురించి బయటకు చెబితే చంపుతాను అంటూ అగోరా బెదిరించారని రాధిక చెబుతుంది.  అంతేకాకుండా తన దగ్గర  డబ్బులు తీసుకుని.. మానసికంగా హింసించారని పేర్కొంది. తన మాదిరిగానే చాలా మంది బాధిత మహిళలు ఉన్నారని.. వారు కూడా బయటకు  వచ్చి ఫిర్యాదు చేయాలని అఘోరీ బాధితులకు రాధిక సూచించారు.  

Also Read:భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

మరోవైపు నగ్నపూజలు చేయిస్తానని చెప్పి నగదు తీసుకుని మోసం చేశాడని మరో మహిళా నిర్మాత మెకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. 308, 301, 351, 352 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టారు.

Also Read : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

ఇదిలా ఉండగా  వర్షిణి తల్లిదండ్రులు, అన్నలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వర్షిణినీ అఘోరి శ్రీనివాస్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. అతని చెర నుంచి తమ కుమార్తెను ఎలాగైనా కాపాడి అప్పగించాలని బాధితులు కోరారు. కాగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్‍లో అఘోరీ శ్రీనివాస్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా అతని ఆగడాలను అరికట్టాలని పలువురు తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు ప్రభుత్వాలను కోరుతున్నారు. కాగా వరుసగా ఫిర్యాదులు వస్తుండంతో అఘోరీని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు ఒకవేళ అఘోరి అరెస్ట్ అయితే వర్షిణీనికి షాక్ తగిలినట్లేనని అందరూ అనుకుంటున్నారు.

Also Read :  సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం

Also Read :  రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు