Rangarajan: అందుకే దాడి చేశాం.. 5వేల మందితో రామరాజ్యం నిర్మిస్తా: వీరరాఘవరెడ్డి సంచలనం

రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డి కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాను ఫేమస్ కావడానికే దాడి చేసినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. 5వేల మందితో రామరాజ్యం నిర్మించడమే టార్గెట్‌ పెట్టుకున్నాడని వెల్లడించారు. 

New Update
Rangarajan rgv

Veeraraghava Reddy Revealed Facts Behind Attack On Rangarajan

Rangarajan: చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డి కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు వీరరాఘవరెడ్డిని విచారించిన పోలీసులు రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరు పరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే రంగరాజన్ పై దాడి ఎందుకు చేశావని ప్రశ్నించగా.. తాను ఫేమస్ కావడానికే దాడి చేశానంటూ వీరరాఘవ రెడ్డి సమాధానం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. 

5 వేల మందితో రామరాజ్యం..

అంతేకాదు 5 వేల మందితో రామరాజ్యం నిర్మించడమే తన టార్గెట్‌ అని, ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని 6 ప్రధాన దేవాలయాలకు వెళ్లినట్లు చెప్పాడనన్నారు. అయితే రామరాజ్యం నిర్మించాలనే తన లక్ష్యానికి రంగరాజన్ సహకరించడం లేదని, తనతో దురుసుగా ప్రవర్తించినందువల్లే దాడి చేసినట్లు బయటపెట్టాడని చెప్పారు. ఇక రామరాజ్య స్థాపన కోసం ఫండ్స్ వసూల్ చేశాడని, ప్రస్తుతం వీర రాఘవరెడ్డి బ్యాంక్ అకౌంట్‌లో రూ.20 వేలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రామరాజ్యం పేరుతో జిల్లా, మండల స్థాయిలోనూ పలు పదవులు కేటాయించి తన ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నట్లు వెల్లడించారు.  

ప్రత్యేక వెబ్ సైట్..

కొవ్వూరి వీర రాఘవరెడ్డి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అన్నపర్తి మండలం కొప్పూరు గ్రామం.  గత కొంత కాలంగా హైదరాబాద్‌ లోని‌‌‌ మణికొండలో నివాసం ఉంటున్న వీర రాఘవ రెడ్డి 2022లో రామరాజ్యం అనే పేరుతో ఓ వెబ్ సైట్ స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా యూట్యూబ్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్స్ లో అకౌంట్స్ క్రియేట్ చేసి  ప్రచారం షురూ చేశాడు. ఇందులో యూత్ ను ప్రేరేపించే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆర్మీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే రామరాజ్యం ఆర్మీ  పేరుతో రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ కూడా మొదలుపెట్టాడు. గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 25 మందిని రిక్రూట్‌‌‌‌ ‌‌‌ చేసుకుని వారికి నెలకు రూ.20 వేల చొప్పున జీతం ఇస్తున్నాడు.  ఈ 25 మందిని 2025 జనవరి 24వ తేదీన  ఏపీలోని పశ్చిమ గోదావరి తణుకుకు తీసుకెళ్లి మీటింగ్‌‌‌‌ కూడా నిర్వహించాడు. 

ఇది కూడా చదవండి: Illeagal Immigrants: అమెరికా డిపోర్టేషన్‌.. మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదన్న కేంద్రం

ఫిబ్రవరి 07వ తేదీన ఉదయం మూడు కార్లలో వీర రాఘవరెడ్డితో పాటుగా ఆర్మీ సభ్యులందరూ రంగరాజన్‌‌‌‌ ఇంటికి చేరుకున్నారు.  ఆర్మీ గురించి వివరించి తమ ఆర్గనైజేషన్‌‌‌‌కు ఆర్థిక సాయం అందించాలని ఆయన్ను  డిమాండ్‌‌‌‌ చేశారు. అంతేకాకుండా చిలుకూరు బాలాజీ గుడి నిర్వహణలోనూ తమకు భాగస్వామ్యం కల్పించాలని బెదిరింపులకు దిగారు. వారి డిమాండ్లకు రంగరాజన్‌‌‌‌ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఇది కూడా చదవండి: CM Revanth: కిషన్ రెడ్డి, కేసీఆర్... ప్లేస్ మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. రేవంత్ సంచలన సవాల్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు