Bus Prank Video: వైరల్ కోసం యువకుడి పిచ్చివేషాలు.. కాలుకున్న చెప్పు తీసి కండక్టర్‌తో!

వైరల్‌ కోసం బస్ కండక్టర్‌ను ఆటపట్టించిన ఓ యువకుడిపై TGSRTC ఎండీ వీ.సీ సజ్జనార్ మండిపడ్డారు. ఇదేం వెర్రి కామెడీ అంటూ ధ్వజమెత్తారు. పాపులారిటీ కోసం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

New Update
VC Sajjanar responds to youth making prank video with bus conductor to go viral

VC Sajjanar responds to youth making prank video with bus conductor to go viral Photograph: (VC Sajjanar responds to youth making prank video with bus conductor to go viral)

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది ఫేమస్ కోసం రకరకాల విన్యసాలు ప్రదర్శిస్తు్న్నారు. ఓవర్‌నైట్‌లో వైరల్‌ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్ర పనులతో ఎదుటివారికి చిరాకు తెప్పిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం పిచ్చి వేషాలు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. రోడ్డు మధ్యలో కూర్చిలు వేసి కూర్చోవడం, వెళ్తున్న బస్సును ఆపి ప్రాంక్ చేయడం.. ఇలా చిర్రెత్తుకొచ్చే చేష్టలతో వైరల్ అవుదామని.. చివరికి చిక్కుల్లో పడుతున్నారు. 

వైరల్ కోసం పిచ్చి వేషాలు

తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ యువకుడు వైరల్ కోసం బస్ కండాక్టర్‌తో ప్రాంక్ చేశాడు. ప్రయాణికుల కోసం ఒక ఆర్టీసీ బస్సు ఆగింది. అదే సమయంలో ఓ యుకుడు కండాక్టర్ వద్దకు వెళ్లి.. బస్సు గుంటూరు పోతుందా అని అడుగుతాడు. 

Also Read :  హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

అప్పుడు కండాక్టర్ వెళ్లదని చెప్తాడు. దీంతో ఆ యువకుడు తన కాలుకున్న చెప్పును తీసి.. ఫోన్‌లా ఉపయోగించాడు. ‘‘అరే గుంటూరు వెళ్లదంటరా ఈ బస్సు’’ అని ప్రాంక్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ యువకుడు చేసిన పనికి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!

ఇక ఇదే వీడియోపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీ.సీ సజ్జనార్ స్పందించారు. ఆ యువకుడు చేసిన పనికి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేం వెర్రి కామెడీ అంటూ ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? అని అన్నారు. మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? అని ప్రశ్నించారు. కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు అని హెచ్చరించారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. 

latest-telugu-news | telugu-news | viral-news | latest prank in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు