/rtv/media/media_files/2025/11/14/fotojet-96-2025-11-14-21-19-31.jpg)
Naveen Yadav After Victory
Naveen Yadav : రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడిగా ఎదగడం పెద్ద విషయం కాదని, వారు ఎన్ని దుర్మార్గాలు చేసినా అత్యాచారాలు చేసినా డ్రగ్స్ తీసుకున్న ఈజీగా రాజకీయ నాయకుడు అవుతున్నాడని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారి ఆర్టీవీతో మాట్లాడుతూ మాలాంటి వాళ్లు రాజకీయంగా నిలబడడానికి 40 సంవత్సరాలు పట్టిందని బావోద్వేగానికి గురయ్యారు.గతంలో అనేక అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆర్ టీవీ తో మాట్లాడుతూ ఎమ్మెల్యే అవ్వడానికి పడ్డ కష్టాలను గుర్తుచేసుకొని నవీన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా గెలిచిన అనంతరం మా నాన్న ,అమ్మ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకొని రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చానన్నారు. జాగృతి ప్రెసిడెంట్ కవిత నాతో చాలా బాగా ఉంటుందని నవీన్ బాంబ్ పేల్చారు. నిజంగానే కవిత ట్వీట్ చేసినట్టుగానే కర్మ సిద్ధాంతం వల్ల టిఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేటీఆర్ కూడా నాతో గతంలో బాగానే ఉండేవాడని, కానీ ఈ చెత్త రాజకీయాల వల్ల చెడిపోయాడన్నారు. నేను ఎమ్మెల్యేగా చేయబోయే మొదటి పని జూబ్లీహిల్స్ కు డిగ్రీ కాలేజ్ తేవడమే అన్నారు. అందరిని కలుపుకొని పోతానన్నారు.
Follow Us