మాజీ మంత్రి, బీఆర్ఎస్(brs) ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) టార్గెట్‌గా మరోసారి తీవ్రవిమర్శలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(kavitha kalvakuntla). జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బాగానే కుట్రలు జరిగాయని ఆరోపించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానని వెల్లడించారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లిలో పాడి రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో పని చేయలేదని.. నిజంగానే ప్రజల కోసం పని చేసి ఉంటే ఫలితాలు మరొలా ఉండేవన్నారు కవిత.. సోషల్ మీడియాలో ప్రచారం తప్ప కింది స్థాయిలో ఎవరూ కూడా పని చేయలేదని చెప్పారు.. హరీష్ రావు, కేటీఆర్ కృష్ణార్జునుల్లా సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని విమర్శించారు. హరీష్ రావు మోసం చేయడం బంద్ చేయాలన్నారు.
Also Read : నా పేరుతోనే సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు: సీపీ సజ్జనార్
రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారు
రెడ్డిపల్లిలో హరీష్ రావు 400 ఎకరాల ఫాంహౌస్ కట్టారని.. ఇందుకోసం ఏకగా రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారని కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు.కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి ఇలా చేశారని కవిత ఆరోపించారు. ఈ అన్ని విషయాలు కేసీఆర్ కు తెలిస్తే వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరని కవిత తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిన అక్రమాలన్నీటికీ హరీష్ రావు అండగా ఉన్నారని కవిత ఆరోపణలు గుప్పించారు. హరీష్ రావు కుటుంబం, ప్రైవేట్ గా పాల వ్యాపారాలు చేసి పాల రైతులకు అన్యాయం చేసిందని, ఎలాంటి టెండర్లు లేకుండానే హాస్టళ్లకు పాలు సప్లై చేసి డబ్బు సంపాదించుకున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు.కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన బయటికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు కవిత. కేసీఆర్‌పై అవాస్తవ ప్రచారం మానుకోవాలని సీఎం రేవంత్ కు ఆమె హితవు పలికారు. మెదక్ లో బీఆర్ఎస్ అధోగతి పాలు కావడానికి స్థానిక నేతల అరచాకలే కారణమన్నారు కవిత.
Also Read : అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్కు KTR కౌంటర్.. సంచలన కామెంట్స్!
Kavitha: KCR కళ్లకు గంతలు కట్టి మోసం చేశారు.. పుండు మీద కారం చల్లుతున్న కవిత!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు టార్గెట్‌గా మరోసారి తీవ్రవిమర్శలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బాగానే కుట్రలు జరిగాయని ఆరోపించారు.
Kavitha