BIG BREAKING: మాజీ స్టార్ క్రికెటర్‌కు ఈడీ సమన్లు

భారత మాజీ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌తో మనీలాండరింగ్ జరిగిందని నేడు ఈడీ ధావన్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
BREAKING NEWS

BREAKING NEWS

భారత మాజీ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్రమ బెట్టింగ్ యాప్‌తో మనీలాండరింగ్ జరిగిందని నేడు ఈడీ ధావన్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ధావన్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా యాప్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అక్రమ బెట్టింగ్ అప్లికేషన్‌లకు సంబంధించిన అనేక కేసులను ఏజెన్సీ పరిశీలిస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీ కన్నీళ్లు.. చిన్నస్వామి తొక్కిసలాటపై తొలి రియాక్షన్..

గతంలో పలు క్రికెటర్లను ప్రశ్నించిన ఈడీ..

గతంలో ఈ బెట్టింగ్ యాప్ కేసు విషయంలో క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఈడీ ప్రశ్నించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల గురించి దర్యాప్తు చేసింది. సురేష్ రైనా 1xBet బెట్టింగ్ గేమింగ్ యాప్‌కు గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు  బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు. దీంతో ఈడీ ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురుని ప్రశ్నించింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌తో పాటు ఊర్వశి రౌతేలా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, దగ్గుబాటి రానా, సోనూసూద్‌లను కూడా ప్రశ్నించింది. బెట్టింగ్ యాప్‌ల వల్ల సామాన్యులు లక్షలు కోల్పోవడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోవడంతో ఈడీ ప్రమోట్ చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది.

ఇది కూడా చూడండి: Breaking: కొత్త జీఎస్టీతో భారీగాపెరగనున్న ఐపీఎల్ టికెట్ రేట్లు

Advertisment
తాజా కథనాలు