బీజేపీ(BJP) నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో తన ఫోన్‌ను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు మొదటి బాధితుడిని తానేనని చెప్పారు. తన ఫోన్ ట్యాప్ చేసి, తన ప్రైవేట్ సంభాషణలను పబ్లిక్‌లో పెట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తన వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలను సిట్ అధికారులకు ఇస్తానని చెప్పుకొచ్చారు. ఈ కేసులో విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై తనకు నమ్మకం లేదన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదన్న సంజయ్... కమిషన్లు, విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
Also Read : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన గువ్వల బాలరాజు!
సీబీఐకి అప్పగిస్తే
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) ను సీబీఐకి అప్పగిస్తే మొత్తం బయటపెడతామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ను ఎక్కువగా ట్యాపింగ్ చేశారని, దీనిపై సిట్ చాలా రోజులుగా విచారణ చేస్తున్న కేసీఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఈ కేసు విచారణలో భాగంగా సిట్ బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా కొన్ని రోజుల ఆలస్యం తర్వాత ఆయన విచారణకు హాజరయ్యారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్‌లను అక్రమంగా ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.
Also Read : Love Murder Case : పెళ్లైన వ్యక్తితో సహజీవనం.. కూతుర్ని నరికి చంపిన తండ్రి.. ప్రియుడి పిటిషన్తో..!
బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరుతారా అన్న ప్రశ్నపై బండి సంజయ్ స్పందించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగస్టు 11న బీజేపీలో చేరనున్నారు. ఈ చేరికను బండి సంజయ్ స్వాగతించారు. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి ఎంపీగా గెలిచిన తర్వాత, బండి సంజయ్ తన నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. కరీంనగర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ సమావేశాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.
Also Read : తెలంగాణ ఆర్టీసీ బంఫర్ ఆఫర్.. బస్సు ఎక్కితే చాలు..
phone tapping case : సిట్ పై నమ్మకం లేదు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో తన ఫోన్‌ను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు మొదటి బాధితుడిని తానేనని చెప్పారు.