Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

రాజస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. 

New Update
Sai Sudarshan

Sai Sudarshan

రాజస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ సంజుశాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయిసుదర్శన్‌ (82) వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

తొలి ఇన్నింగ్స్ పూర్తి

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఉంది. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు