/rtv/media/media_files/2025/10/13/telangana-mala-sangam-2025-10-13-16-58-41.jpg)
Unexpected shock for Congress in Jubilee Hills.
SC Classification : తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ(sc classification go latest) ఇంకా అగ్గిరాజేస్తోంది. ఎస్సీ వర్గీకరణ పేరుతో గత ఐదు నెలలుగా ఎస్సీలోని 58 కులాలకు కాంగ్రెస్ మోసం చేస్తోందని మాలసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఎస్సీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని, విద్య, ఉద్యోగ, ప్రమోషన్లలో ఎదురవుతున్న నష్టాన్ని నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మండాల బాస్కర్ ఆధ్వర్యంలో ఈ రోజు (సోమవారం) సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ....గత ఐదు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, వివిధ పార్టీల అధ్యక్షులకు తమకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రాలు అందజేసినా స్పందన లేకుండా పోయిందని వాపోయారు, మాల సమాజానికి జరుగుతున్న అన్యాయం, రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ ఆకాంక్షను, ఆవేదనను తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
Also Read : నేనేంటో అందరికీ తెలుసు.. కొండా సురేఖతో విభేదాలపై పొంగులేటి సంచలన కామెంట్స్!
Unexpected Shock For Congress In Jubilee Hills
దీనికోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన- తెలియజేయాలని నర్ణయించామని అందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో 300 మంది మాలలు నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు. ఐదు నెలలుగా గ్రూప్-3లోని మాల 25 కులాలకు జరుగుతున్న నష్టంపై ఈ పోటీ ఒక నిరసన యుద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు.కాగా ఈ సందర్భంగా మాలలు కొన్ని డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుపెట్టి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాటిలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తక్షణమే సవరించాలి.మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ శాతం పెంచాలి.20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మందాల భాస్కర్, మాలలపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాల సామాజిక వర్గ విద్యార్థుల విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బకొట్టి, వర్గీకరణ ద్వారా మాలలను అన్ని రంగాల్లో నాశనం చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.అమలుకాని ఆరు గ్యారంటీలు, అబద్ధపు హామీలతో దేశానికి వెన్నెముకైన రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా బస్తా కోసం రైతులు రోడ్ల మీదకు వచ్చారన్నారు.రాష్ట్రంలో ప్రజా పరిపాలన ప్రజల ప్రాణాలను తీసే పరిపాలనగా మారిందని ఆరోపించారు.విద్య వ్యవస్థ నిర్వీర్యమైంది. ప్రభుత్వ విద్య, వైద్యం పేదలకు కరువైంది. ప్రభుత్వ దావఖానాలు దివాలా తీస్తున్నాయని ఆరోపించారు.రుణమాఫీ, రైతు భరోసా, వృద్ధాప్య పెన్షన్, మహిళలకు ₹2500, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం చేతకాని రేవంత్ రెడ్డి, తెలంగాణ బడ్జెట్ను, ట్రిలియన్ ఎకానమీని పెంచుతానని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy) పరిపాలన తన సొంత కుటుంబం, అనుచరుల చేతుల్లో ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. ప్రజాస్వామిక వాదులైన మాలలు, జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కలిసికట్టుగా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి, జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నాంది పలకాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకుంటే, రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి మాలలు కంకణం కట్టుకుంటారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఈ సమస్యపై తక్షణమే స్పందించకుంటే, కాంగ్రెస్ పార్టీ అంతం మాలల పంతంగా భావిస్తూ తమ నిరసన యుద్ధాన్ని కొనసాగిస్తామని మందాల భాస్కర్ హెచ్చరించారు.
Also Read: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య