Ponguleti Srinivas Reddy: నేనేంటో అందరికీ తెలుసు.. కొండా సురేఖతో విభేదాలపై పొంగులేటి సంచలన కామెంట్స్!

మంత్రి కొండా సురేఖతో విభేదాలపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు. రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయ పడే అంత అవసరం తనకు లేదన్నారు.

New Update
Konda Surekha Vs Ponguleti Srinivas Reddy

మంత్రి కొండా సురేఖ(konda-surekha) తో విభేదాలపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(ponguleti-srinivas-reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు. రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయ పడే అంత అవసరం తనకు లేదన్నారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా మేడారం అభివృద్ధికి రూ.211 కోట్ల నిధులు కేటాయించామన్నారు. నా మీద సహచర మంత్రులు ఎవరూ ఫిర్యాదు చేశారని నమ్మడం లేదన్నారు. తన మీద పిర్యాదు చేయడానికి అసలు ఏమి ఉంది? అని ప్రశ్నించారు. సీతక్క, సురేఖ ఇద్దరు మంత్రులు సమ్మక్క సారక్క లాగా పనిచేస్తున్నారని కొనియాడారు.గత కొన్ని రోజులుగా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. శ్రీనివాస్ రెడ్డిపై ఏకంగా హైకమాండ్ కే ఫిర్యాదు చేశారు సురేఖ. జిల్లాకు చెందిన తన ప్రమేయం లేకుండా మేడారం టెండర్ల విషయంలో ఆయన జోగ్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన శాఖతో పాటు జిల్లాలోనూ ఆయన జోక్యం సరికాదన్నారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆఫీసుకే నేరుగా పోన్ చేసి కంప్లైంట్ చేశారు సురేఖ.

Also Read :  వేములవాడలో దర్శనాల వివాదం..పొంతనలేని ప్రకటనలతో అయోమయం

Ponguleti Srinivas Reddy vs Konda Surekha Cold War

Also Read :  జూబ్లీహిల్స్‌ లో దొంగ ఓట్ల కలకలం.. ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్!

దీంతో ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయంపై సీరియస్ గా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. తనను సంప్రదించకుండా నేరుగా హైకమాండ్ కు మరో మంత్రిపై ఫిర్యాదు చేయడంపై రేవంత్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడారం అభివృద్ధి పనులను వివాదం చేయడం సరికాదని రేవంత్ అభిప్రాయపడ్డట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సురేఖ తీరుపై హైకమాండ్ కు ఆయన రిపోర్ట్ పంపించినట్లు తెలుస్తోంది. 

ఈ రోజు మేడారం జాతరకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. శ్రీనివాస్ రెడ్డి వెంట జిల్లాకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఉన్నారు. కానీ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు