/rtv/media/media_files/2025/04/30/jbrYvQSJ9EJ3HoerHZEz.jpg)
Mahabubabad district ranks first in Telangana 10th class results
ఇవాళ తెలంగాణ టెన్త్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 5,09,564 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా.. ఫలితాల్లో 92.78% మంది విద్యార్థులు సక్సస్‌ఫుల్‌గా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు. అందులో బాలురు 91.32 శాతం ఉత్తీర్ణతతో దూసుకుపోయారు. అదే సమయంలో బాలురను వెనక్కి నెట్టి ఈసారి కూడా బాలికలే సత్తాచాటారు. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచారు.
Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
ఇదిలా ఉంటే దాదాపు 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతో దుమ్ముదులిపేశాయి. అదే సమయంలో 2 స్కూల్స్ మాత్రం సున్నా శాతం ఫలితాలతో వెనుకబడ్డాయి. జిల్లాల వారీగా పదో తరగతి ఫలితాలు చూసుకుంటే.. మహబూబాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే ప్రదమ స్థానంలో ఉంది. ఈ జిల్లా 99.29 శాతం ఉత్తీర్ణత సాధించింది. అదే సమయంలో వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతం నమోదు చేసింది. ఇది 73.97 శాతం సాధించి చివరి స్థానంలో నిలిచింది.
Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు మొత్తం 8,184 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో బాలురు 4,229 మంది, బాలికలు 3,955 మంది ఉన్నారు.
ఉత్తీర్ణత పొందిన వారి సంఖ్య విషయానికొస్తే.. మొత్తం 8,126 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురు 4,195 మంది కాగా బాలికలు 3,931 మంది విద్యార్థులు ఉన్నారు.
Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
ఇక వీరి ఉత్తీర్ణత శాతం విషయానికొస్తే.. మొత్తం 99.29 శాతంతో ఈ జిల్లా మొదటి స్థానంలో ఉంది. అందులో బాలురు 99.20 శాతం, బాలికలు 99.39 మంది విద్యార్థులు ఉన్నారు.
వికారాబాద్ జిల్లా
పదోతరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. ఈ పరీక్షలకు మొత్తం 12,846 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో బాలురు 6,405 మంది, బాలికలు 6,441 మంది ఉన్నారు.
ఉత్తీర్ణత పొందిన వారి విషయానికొస్తే.. మొత్తం 9502 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురు 4,469 మంది కాగా బాలికలు 5,033 మంది విద్యార్థులు ఉన్నారు.
Also Read : ఆ సమస్యలను పరిష్కరించండి...కేంద్ర మంత్రితో ఎంపీ సానా సతీష్ బాబు భేటీ!
ఇక వీరి ఉత్తీర్ణత శాతం విషయానికొస్తే.. మొత్తం 73.97 శాతంతో ఈ జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. అందులో బాలురు 69.77 శాతం, బాలికలు 78.14 మంది విద్యార్థులు ఉన్నారు.
Tg SSC 10th Results 2025 | latest-telugu-news | telugu-news | mahabubabad | vikarabad-district
Follow Us