MP Sana Sathish Babu : ఆ సమస్యలను పరిష్కరించండి...కేంద్ర మంత్రితో ఎంపీ సానా సతీష్ బాబు భేటీ!

ఏపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో సమావేశమయ్యారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు, న్యాయశాఖలో ఖాళీలను భర్తీ చేయడం వంటి ముఖ్యమైన డిమాండ్లు అందులో ఉన్నాయి.

New Update
sana sathish babu

sana sathish babu

ఏపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఏపీలో చట్టం, న్యాయ వ్యవస్థలకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై  ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు.  కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు, న్యాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్యను పెంచడం, న్యాయశాఖలో ఖాళీలను భర్తీ చేయడం, రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో సదుపాయలను  మెరుగుపరచడం వంటి ముఖ్యమైన డిమాండ్లు అందులో ఉన్నాయి.

Also read :  నెల్లూరులో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం!

Also read : తుంగతుర్తి కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే సామేలుకు వ్యతిరేకంగా ఆందోళన!

టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా

న్యాయవ్యవస్థ మధ్య సమన్వయం, కేసుల పరిష్కారాలలో జాప్యం, కోర్టు సౌకర్యాల ఆధునీకరణ ఆవశ్యకతకు సంబంధించిన అంశాలను కూడా ఎంపీ సానా సతీష్ బాబు  కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సూచించిన అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా కాకినాడ జిల్లాకు చెందిన సానా సతీష్ బాబు 2024 డిసెంబర్ 13న టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  సానా సతీష్‌బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసి కాకినాడలో ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయాల పట్ల ఆసక్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.  

Also read : TG BJP: తెలంగాణ బీజేపీలో భూకంపం.. కీలక నేతలకు సస్పెండ్ వార్నింగ్!

mp sana satish babu | Law Minister Arjun Ram Meghwal | andhra-pradesh

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు