/rtv/media/media_files/2025/02/24/5r9eYqdV35qnmAfLhWCH.jpg)
Travels bus overturns on Sullurpet Highway in Tirupati, AP
దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డంక అండ్ డ్రైవ్, ఓవర్ టేక్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రయాణికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు విడుస్తున్నారు. తరచూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ ఘటనలు చేసుచేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. వీటిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు.
ఇంకా అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే కుంభమేళా సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎన్నో బస్సులు బోల్తా పడ్డాయి. మరెన్నో వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. ఎందరో మరణించారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో జరిగింది.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
తెలంగాణలో ట్రావెల్స్ బస్సు దగ్ధం
ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనే మరోకటి తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలో ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది. బస్సు టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కన నిలిపివేశాడు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.