/rtv/media/media_files/2025/05/19/5i1FmHfbGOXYtXK5ksEi.jpg)
Transport Department to File Case against Over speed Vehicle Owners
రహదారుల్లో రూల్స్ ఉల్లంఘించే వాహనాదారుల కట్టడి కోసం రాష్ట్ర రవాణాశాఖ రెడీ అవుతోంది. కొత్తగా నియామకమైన 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల(AMVI)లతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. అయితే వీళ్లందరినీ క్షేత్రస్థాయి విధుల్లో వాహనాలు తనిఖీ చేసేందుకు వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగానే ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాల వాడకం కోసం
Also Read: హైదరాబాద్ లో జ్యోతి జాడలు.. వెలుగులోకి కీలక విషయాలు
Transport Department Rules
ముఖ్యంగా రహదారుల ప్రమాదాలకు అతివేగమే ఓ ప్రధాన కారణం. వేగ పరిమితులను నిర్దేశించినప్పటికీ కూడా చాలామంది వాహనదారులు దీన్ని పాటించడం లేదు. గతేడాది అధిక వేగంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన కేసులు ఏకంగా 11.31 లక్షలు నమోదయ్యాయి. ఇందులో 25,971 మంది అన్నిరకాల రహదారి ప్రమాదాల్లో బాధితులయ్యారు. ఇకనుంచి అధిక వేగంతో వెళ్లే వాళ్లపై కూడా రవాణాశాఖ కేసులు నమోదు చేయనుంది. ఇందుకోసం 40 స్పీడ్ గన్‌లను కొనాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒక్కోదాని ఖరీదు రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.2.8 కోట్లు అవసరమవుతాయి.
Also read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
అయితే రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు వాహనాలు తనిఖీ చేసినప్పుడు వెహికిల్ చెక్ రిపోర్టు (VCR)ను మాన్యువల్‌గానే రికార్డు చేస్తున్నారు. కానీ ఈ వివరాల నమోదు ఆలస్యం కావడం వల్ల ఎక్కువ వాహనాలు చెక్ చేయలేకపోతున్నారు. ఇందుకోసం ట్యాబ్ (హ్యాండ్‌హెల్డ్ డివైజ్)లు కొనేందుకు రవాణాశాఖ రెడీ అవుతోంది. వీటితో వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు రియల్ టైంలో ట్యాబ్‌లో రికార్డు చేయొచ్చు. వాహనాదారులను జరిమానాలను, పాత బకాయిలను వెంటనే చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇందులో ఒక్కో ట్యాబ్ ధర రూ.1.5 లక్షలు. అయితే 375 ట్యాబ్‌లు కొనుగోలు చేసేందుకు రూ.5.6 కోట్లు ఖర్చు కానుంది.
Also Read: జ్యోతికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
Also Read : పహల్గాంకు జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు
telugu-news | rtv-news | telangana | transportation