లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ పై ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని కించపరిచాడంటూ సీరియస్ అయ్యారు కమ్యూనిటీ సభ్యులు. లేడీ అఘోరీ వస్తే చంపేస్తామంటూ సంచలన వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇప్పటికే లేడీ అఘోరీపై జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసులపై లేడీ అఘోరీ స్పందించారు. ఇకపై తాము తెలుగు రాష్ట్రాలకు రానంటూ ప్రకటన చేశారు. ప్రస్తుతం అఘోరీ, వర్షిణిలు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని కనిపించకుండా పోయారు. ఇలాగే తమను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే చనిపోతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
Also read : Google layoffs : ఇండియాలోని ఉద్యోగులకు గూగుల్ బిగ్‌షాక్... వాళ్లంతా ఔట్!
Also Read: Hyderabad: హైదరాబాద్ లో మరో కిరాతకం.. నాలుగేళ్ళ కూతురికి విషమిచ్చి చంపిన తల్లి!
ఘోరీపై తీవ్రమైన వ్యతిరేకత
వర్షిణితో పెళ్లి తర్వాత లేడీ అఘోరీపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అఘోరీపై వ్యతిరేకత గళాన్ని వినిపించేవాళ్లు ముందుకు వస్తున్నారు. అఘోరీ మొదటి భార్య తానంటూ ఇటీవల ఓ మహిళ ముందుకు వచ్చి పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో తెలంగాణ పోలీసులు వీరికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఏ టైమ్ లోనైనా అఘోరీ, శ్రీ వర్షిణిలని పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా అఘోరీ, శ్రీ వర్షిణిలు ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఓ కాళిమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read: TGSRTC: ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ !.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
Also read : Dhanush ధనుష్ 'ఇడ్లీ కడై' సెట్ లో అగ్ని ప్రమాదం.. వీడియో వైరల్