/rtv/media/media_files/2025/04/20/tUd03g6szpp8TJTLS1KR.jpg)
google layoffs 2025
ఇండియాలోని ఉద్యోగులకు గూగుల్ బిగ్‌షాక్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఇండియాలో భారీగా ఉద్యోగుల తొలగింపుకు గూగుల్ సిద్ధమవుంది. బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లోని ఉద్యోగుల తొలగింపునకు రెడీ అవుతోంది. యాడ్స్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో లే ఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. గత రెండేళ్లలో వేలాది మందిని తప్పించిన గూగుల్.. తాజాగా ఖర్చు తగ్గింపులో భాగంగా లేఆఫ్స్ ప్రకటన చేయనుంది. అయితే గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు కానీ వచ్చే వారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చని బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది. కాగా గత సంవత్సరం గూగుల్ తన ప్లాట్‌ఫామ్స్, డివైజెస్ విభాగాలను విలీనం చేసింది.
Also read: TGSRTC: ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ !.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
Also read : Dhanush ధనుష్ 'ఇడ్లీ కడై' సెట్ లో అగ్ని ప్రమాదం.. వీడియో వైరల్
ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్
400 మంది ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసేసిన భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జయేష్ వెల్లడించారు. 2025 ఆర్థిక సంవత్సరానికి 15,000 నుండి 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇక శాలరీ హైక్ ల గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీలో జీతాల పెంపు సగటున 5-8% శాతం ఉందన్నారు. మంచిగా పనిచేసిన వారికి 10-12%శాతం పెంచామని అన్నారు. జనవరిలోనే చాలామందికి శాలరీలు పెరిగాయని.. మిగితా వారికి 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
Also read : Rains alert : బయటకు వెళ్తున్నారా? జర జాగ్రత్త...రెండురోజులపాటు దంచుడే దంచుడు
Also read : Husband: బ్యూటీపార్లర్‌కు భార్య, పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య