/rtv/media/media_files/2025/04/20/ic9kjD7Zcn2hWM0bUVcc.jpg)
mother killed 4 year old child with poison
Hyderabad: హైదరాబాద్ లో మరో కిరాతకంగా ఘటన వెలుగు చూసింది. కన్నతల్లి నాలుగేళ్ళ కూతురికి విషమిచ్చి చంపింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాచుపల్లి పరిధిలోని ప్రగతి నగర్ ఆదిత్య గార్డెన్స్ లో సాంబశివరావు, నంబూరి కృష్ణ పావని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ నాలుగేళ్ళ పాప కూడా ఉంది.
కన్న కూతురికి విషమిచ్చి
అయితే శుక్రవారం సాయంత్రం భార్య కృష్ణపావని దారుణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ నాలుగేళ్ళ కుమార్తెకు కూల్ డ్రింక్ లో విషయం కలిపి తాగించింది. ఆ పై తాను కూడా విషం తాగింది. ఈ విషయాన్ని శనివారం తెల్లవారుజామున భర్తకు చెప్పింది. దీంతో భర్త సాంబశివరావు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే కూతురు మృతి చెందింది. కృష్ణ పావని ఐసీయూలో చికిత్స పొందుతుంది. అయితే ఆరోగ్య సమస్యల వల్లే పావని ఇలా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Mad Square OTT: థియేటర్లలో హిట్ కొట్టిన ‘మ్యాడ్ స్క్వేర్’.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్?
ఇటీవలే వేట కొడవలితో మరో తల్లి
ఇటీవలే మేడ్చల్ జిల్లా గాజులరామారంకి చెందిన తేజస్విని రెడ్డి అనే మహిళ తన ఇద్దరు పిల్లల్ని వేట కొడవలితో వెంటాడి నరికి చంపింది. తనతోపాటు పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెందింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో 6పేజీల సూసైడ్ నోట్ రాసింది. ఆ తర్వాత ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న పిల్లలు ఆశిష్, హర్షిత్‌ను పట్టుకొని.. వేటకొడవలితో మెడ, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా నరికింది. పాపం ఆ పసివాళ్లు పారిపోతున్న వదిలిపెట్టలేదు. ఈ ఘటనలో ఆశిష్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
latest-news | hyderabad | telugu-news | crime