Idli Kadai ధనుష్ 'ఇడ్లీ కడై' సెట్ లో అగ్ని ప్రమాదం.. వీడియో వైరల్

హీరో ధనుష్ 'ఇడ్లీ కడై' సెట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని తేనిలోని అనుప్పపట్టి గ్రామంలో చిత్రీకరణ జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update

Dhanush కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాల్గవ చిత్రం 'ఇడ్లీ కడై'. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తమిళనాడులోని  తేనిలోని అనుప్పపట్టి గ్రామంలో చిత్రీకరణ జరుగుతుండగా.. సెట్ లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అదృస్టవశాత్తు సెట్ లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అందరు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నివేదికల ప్రకారం.. చిత్ర యూనిట్ సెట్ ని అలాగే వదిలేసి.. షూటింగ్ కోసం మరో ప్రదేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Mad Square OTT: థియేటర్లలో హిట్ కొట్టిన ‘మ్యాడ్ స్క్వేర్’.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్?

అక్టోబర్ 1న 

ఇడ్లీ కడై, అక్టోబర్ 1న  థియేటర్స్ లో విడుదల కానుంది.ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఓ కొత్త కాన్సెప్ట్ తో ధనుష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ధనుష్ తో పాటు నిత్యా మీనన్, అరుణ్ విజయ్ తదితరులు  కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'తిరుచిత్రంబళం' తర్వాత నిత్యామీనన్, ధనుష్ ఈ సినిమాతో మరోసారి జతకట్టారు. ధనుష్ వండర్ బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

telugu-news | idli-kadai | latest-news | fire accident

Also Read: Malavika: లోకల్‌ ట్రైన్‌లో స్టార్ నటికి యువకుడి ముద్దు.. Aభయంతో ఆమె ఏం చేసిందంటే!

Advertisment
తాజా కథనాలు