Mahesh Kumar Goud:దోచుకోవడంలో దేశంలోనే కేసీఆర్ ఫ్యామిలీ నెం.1 టీపీసీసీ

దోచుకోవడంలో దేశంలోనే కేసీఆర్ ఫ్యామిలీ నెం1 స్థానంలో నిలిచిందని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అధికారం కోల్పోయిన కేటీఆర్ అహంకార ధోరణి వీడలేదని, పగటి కలలే కంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. 

New Update
mahesh kumar goud

TG News: తెలంగాణ ప్రదాత, ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ 78వ జన్మదినోత్సవ వేడుకలను డిసెంబర్ 9 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని టీపీసీసీ మహేష్‌ కుమార్ గౌడ్ అన్నారు. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ది పనులను కాంగ్రెస్ ఏడాదిలో చేసి చూపించిందని చెప్పారు. అధికారం కోల్పోయిన కేటీఆర్ అహంకార ధోరణి వీడలేదని, పగటి కలలే కంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. 

Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

కేటీఆర్, కవిత ఏం త్యాగం చేశారు..

ఈ మేరకు లక్షల కోట్లు దోపిడీ చేసిన మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా అనుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాం. తెలంగాణ కోసం కేటీఆర్, కవిత ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు. దేశంలోనే తక్కువ సమయంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే అది కేసిఆర్ కుటుంబమే అని ఆరోపించారు. 

Also Read: Rashmika: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్

రేవంత్ హయంలో స్వేచ్ఛకు కొదువ లేదు..

బీఆర్ఎస్ హయంలో స్వేచ్చ కొరవడింది. సీఎం రేవంత్ హయంలో స్వేచ్ఛకు కొదువ లేదు. కౌశిక్ రెడ్డి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదు పదేళ్ల నిరంకుశ పాలనకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కేసీఆర్, కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎవరుకూడ ఉండలేని పరిస్థితి. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సరిగ్గా సరిపోయే పేరు కిస్మత్ రెడ్డిబీజేపీ పార్టీకి పేదల గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రతిపక్ష నాయకుడిని ఫాం హౌస్ లో బంధించి కేటీఆర్, హరీష్  పిల్ల చేష్టలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు. 

Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?

Also Read : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు