ప్రెజెంట్ వరల్డ్ వైడ్ 'పుష్ప' మేనియా నడుస్తోంది. మూవీ లవర్స్ ఎప్పడెప్పుడా అని ఎదురుచూసిన 'పుష్ప2' మూవీ నిన్న రాత్రి విడుదలైంది. ఎక్కడ చూసినా ఆడియన్స్ నుంచి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ముఖ్యంగా సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని ఆడియన్స్ అంతా బన్నీని పొగడ్తలతో ముంచేస్తున్నారు.
టాలీవుడ్ లోనే బెస్ట్ సీక్వెన్స్..
ముఖ్యంగా సినిమాలో జాతర ఎపిసోడ్ అద్భుతమని, గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్ స్టార్ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్ తెప్పించారని, ఈ ఎపిసోడ్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. అయితే అల్లు అర్జున్ ‘పుష్ప2’ ప్రీమియర్‌ను హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి చూశారు.
జాతర సీక్వెన్స్ కి ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తూ మురిసిపోయిన @alluarjunpic.twitter.com/T7HEs4l4f1
— Rajesh Manne (@rajeshmanne1) December 4, 2024
జాతర ఎపిసోడ్‌కు ఆడియన్స్ బన్నీకి సలాం కొట్టగా అల్లు అర్జున్ విజయోత్సహంతో ఆనందం వ్యక్తంచేశారు. ఆ ఎపిసోడ్ కి థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చూసి బన్నీ తెగ మురిసిపోయాడు. ఆ క్షణం సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని మర్చిపోయాడు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Blockbuster kottesaam anna 🥹❤️🔥
— AlluBabloo Mithun (@allubabloo18) December 4, 2024
Love you @alluarjun #Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/lAX2YcmZ1j
Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!