Sukumar : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా?

'ఆర్య' తర్వాత సుకుమార్‌.. రామ్‌తో ‘జగడం’ సినిమా తీశారు. కమర్షియల్ గా మూవీ సక్సెస్ కాకపోయినా సుకుమార్ టేకింగ్ ఆకట్టుకుంది. నిజానికి ఈ సినిమాను మొదట అల్లు అర్జున్ తో తీయాలనుకున్నాడట. కానీ దిల్‌రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా రామ్‌తో తీయాల్సి వచ్చిందట.

New Update
sukumar011

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోకి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ 'ఆర్య'.. ఈ సినిమా అటు హీరోగా అల్లు అర్జున్ కు,ఇటు డైరెక్టర్ గా సుకుమార్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు డైరెక్టర్ గా సుకుమార్ కు ఇది తొలి సినిమా కావడం విశేషం. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీతో సుకుమార్ వన్ సైడ్ లవ్ అనే సరికొత్త కాన్సెప్ట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో పాటూ డైరెక్టర్ గా సుకుమార్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత సుకుమార్‌.. రామ్‌తో ‘జగడం’ తీశారు. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాకపోయినా సుకుమార్ టేకింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. నిజానికి ఈ సినిమాను మొదట అల్లు అర్జున్ తో తీయాలనుకున్నాడట సుకుమార్.  అయితే, దిల్‌రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా రామ్‌తో తీయాల్సి వచ్చిందట. 

Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?

దిల్‌రాజుతో గొడవ..

ఈ విషయాన్ని సుకుమార్ ఓ సందర్భంలో పంచుకున్నారు.' నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా మాట్లాడాలో పెద్దగా తెలిసేది కాదు. ప్రపంచం కూడా మనలాగే ఉంటుందనుకోలేదు. ‘ఆర్య’ హిట్‌ కావడంతో గాల్లో తేలిపోయా. ఆ సందర్భంలో బన్నితో ‘జగడం’ చేయాలనుకున్నా. కథతో సహా అన్ని సిద్ధమయ్యాయి. అయితే, అదే సమయంలో దిల్‌రాజుతో చిన్న సమస్య వచ్చింది. కోపం పట్టలేకపోయా. బాగా ఎమోషనల్‌ అయిపోయా. 

బన్నీ, మహేష్ అయితే బాగుండేది..

వెంటనే రాత్రికి రాత్రే రామ్‌ దగ్గరకు వెళ్లిపోయి, కథ చెప్పడం.. ఒకే చేయించుకోవడం అయిపోయింది. అంతేకాదు.. మరుసటి రోజే ముహూర్తం కూడా పెట్టించేశా..' అని అన్నారు. అంతేకాకుండా 'జగడం' లో రామ్‌ చేసిన పాత్ర బన్ని లేదా మహేష్‌ అయితే బాగుండేదని, అతడి తమ్ముడి పాత్రకు రామ్‌ అయితే సరిపోయేవాడు కానీ, అలా జరగలేదని, ‘జగడం’ ఫ్లాప్‌ కావడంతో నాలోనూ మార్పు వచ్చిందని చెప్పుకొచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు