Pushpa 2 : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?

'పుష్ప2' తర్వాత బన్నీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సందిగ్థత నెలకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఒక్క సినిమా లేదనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ తో నెక్స్ట్ మూవీ ఉన్నా కూడా ఆ మూవీ ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
allu arjun06

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప2' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా 'బన్నీ వన్ మ్యాన్ షో' అని చెబుతున్నారు. 

ముఖ్యంగా సినిమాలో జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని, ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని సినీ ఆడియన్స్ తో పాటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. దీంతో ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మ రథం పడుతున్నారు.  ఇదిలా ఉంటే 'పుష్ప2' తర్వాత బన్నీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో సందిగ్థత నెలకొంది.

ఇది కూడా చదవండి : కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డ్ .. ఇందులో స్పెషాలిటీ ఇదే..!

'పుష్ప2' ఎఫెక్ట్..

తాజా సమాచారం ప్రకారం 'పుష్ప2' తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఒక్క సినిమా లేదనే టాక్ వినిపిస్తోంది. నిజానికి త్రివిక్రమ్ తోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండాలి. కానీ ఆ ప్రాజెక్ట్ ప్రీవియస్ మూవీస్ కి మించి ఉండాలి, దానికి తోడు 'పుష్ప2' లో బన్నీ ఫెరఫార్మెన్స్ ను బీట్ చేసేలా నెక్స్ట్ సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ ఉండాలి. అలాంటి స్క్రిప్ట్ కోసం బన్నీ ఎదురుచూస్తున్నాడు. 

ఒకవేళ త్రివిక్రమ్ తో నెక్స్ట్ మూవీ ఉన్నా కూడా.. గురూజీ స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి బన్నీ నెక్స్ట్ మూవీ ఇప్పుడప్పుడే  ఉండకపోవచ్చు. దానికి చాలానే టైం పట్టొచ్చని ఇన్సైడ్ వర్గాల సమాచారం.  ఇదే నిజమైతే బన్నీ కనీసం ఏడాది వరకైనా ఖాళీగా గడపాల్సిందే.

ఇది కూడా చదవండి : అల్లు అర్జున్ హౌస్ అరెస్టు.. సంధ్య థియేటర్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు