TGPSC Group 1 Results: గ్రూపు 1 ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్లు...అపజయాల నుంచి విజయతీరాలకు..

తెలంగాణ గ్రూపు 1 ఫలితాలను ఎట్టకేలకు టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్​ 1 ఫలితాల్లో పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా వారికి సమానంగా మహిళలు పోటీ పడ్డారు. టాప్​ 50 ర్యాంకుల్లో 25 మంది, తొలి వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉండటం విశేషం.

New Update
TGPSC Group 1 Rankers

TGPSC Group 1 Rankers

తెలంగాణ గ్రూపు 1 ఫలితాలను(Group 1 Results) ఎట్టకేలకు టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేసింది. గతంలో ప్రకటించిన ర్యాంకులే అయినప్పటికీ కోర్టు కేసుల నేపథ్యంలో మరోసారి ర్యాంకర్లను ప్రకటించింది. తెలంగాణ గ్రూప్​ 1 ఫలితాల్లో పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా వారికి సమానంగా మహిళలు పోటీ పడ్డారు. టాప్​ 50 ర్యాంకుల్లో 25 మంది, తొలి వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉండటం విశేషం.

Also Read :  నిరుద్యోగులకు దసరా కానుక.. 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!

డాక్టర్‌ లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి

కాగా హైదరాబాద్​కు చెందిన డాక్టర్‌ లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి రాష్ట్రంలో గ్రూపు 1 మొదటి ర్యాంక్​ సాధించారు. మెయిన్స్​ పరీక్షల్లో 900 మార్కులకు గాను లక్ష్మీ దీపిక 550 మార్కులు సాధించి టాప్‌గా నిలిచారు. ఉస్మానియాలో ఎంబీబీఎస్​ పూర్తి చేసిన లక్ష్మీ దీపిక గతంలోనే ఎంపీడీవో గా కూడాసెలెక్టయ్యారు. రెండు సార్లు యూపీఎస్​సీ ఇంటర్వ్యూ కు కూడా సెలెక్టయ్యారు.

లక్ష్మీదీపిక తండ్రి కృష్ణ కొమ్మిరెడ్డి సీనియర్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. తల్లి పద్మావతి గృహిణి. తల్లిదండ్రులకు లక్ష్మీదీపిక ఏకైక సంతానం. పది వరకూ సఫిల్‌గూడలోని డీఏవీ స్కూల్లో చదివిన లక్ష్మీదీపిక 2013 మెడిసిన్‌లో 119వర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. మొదట అమెరికా వెళ్లి మాస్టర్స్‌ చేయాలని భావించినప్పటికీ ‘యూపీఎస్సీ’ మెరుగైన ఎంపిక అనుకుని అటుగా నడిచారు. ఎక్కడా శిక్షణ కూడా తీసుకోకుండా సొంత ప్రిపరేషన్‌ సాగించారు. 2020, 2021,2023లలో సరైన మార్కులు సాధించలేకపోయారు.2024 లో సొంతంగా చదవి  రాష్ట్రస్థాయిలోనే ఫస్ట్‌ర్యాంకు సాధించారు.

దాడి వెంకటరమణ

గ్రూపు 1లో రెండో ర్యాంక్ సాధించిన దాడి వెంకటరమణది నల్గొండ జిల్లా. గ్రూపు1లో 535.5 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. ఆరేండ్లుగా సివిల్​ సర్వీసెస్‌కు ప్రిపేరవుతున్న వెంకటరమణ.. గ్రూప్‌-1 ఫస్ట్ అటెంప్ట్ లోనే సత్తా చాటాడు, ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన జూనియర్‌ లెక్చరర్‌ సివిక్స్‌ పోస్టుకు, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టుకు కూడా ఎంపికయ్యారు. అంతేకాక గ్రూప్‌-2లో 378వ ర్యాంకు సాధించారు. అయితే ఆయన ఆర్డీవో పోస్టును ఎంచుకున్నారు.

తేజస్వినిరెడ్డి

మల్టీ జోన్‌-1 కేటగిరీలో టాపర్‌గా హన్మకొండ జిల్లాకు చెందిన తేజస్వినిరెడ్డి (532.5 మార్కులు) నిలిచారు. మొత్తం మీద నాలుగో ర్యాంకు సాధించారు. ఆమె ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ గ్రూపు 1 సాధించి ఆర్డీవోగా సెలక్ట్‌ అయ్యారు.

సిద్ధాల కృతిక

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట కార్పొరేషన్‌ జిల్లెలగూడకు చెందిన సిద్ధాల కృతిక గ్రూపు-1లో ఐదవ ర్యాంక్‌ సాధించారు. 532 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఈ ర్యాంకు సాధించారు. నాలుగు సార్లు సివిల్స్‌ కు ప్రయత్నించిన కృతికకు గతంలో మంచి ర్యాంకు రాలేదు. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-4లో 511వ ర్యాంకు సాధించిన కృతిక  వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తాజాగా గ్రూప్‌-1లో రాష్ట్రస్థాయి ఐదో ర్యాంకు సాధించడంతో ఆర్డీవోగా చేరనున్నారు.

పూనాటి హర్షవర్ధన్‌

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పూనాటి హర్షవర్ధన్‌ గ్రూప్‌-1లో  రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు, మల్టీ జోన్‌-2 స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. హర్ష వర్తన్‌ బిట్స్‌ పిలానీ లో ఇంజనీరింగ్​ చదివారు, ఆయన​ రూ.27 లక్షల వార్షిక వేతనంతో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం మానేసి సివిల్ప్​కు ప్రిపేరవుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆర్డీవోగా విధుల్లో చేరనున్నారు.

Advertisment
తాజా కథనాలు