Tollywood: అలా చేస్తే నేను హ్యాపీ.. రేవంత్ తో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలన్న అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేదే తమ కోరిక అని నాగార్జున తెలిపారు. 

New Update
Nagarjuna Revanth Reddy Meeting

Nagarjuna Revanth Reddy Meeting

సీఎం రేవంత్ తో జరిగిన టాలీవుడ్ పెద్దల భేటీలో సీనియర్ హీరో నాగార్జున పాల్గొన్నారు. రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేదే తమ కోరిక అని నాగార్జున తెలిపారు.

Also Read :  చేసిందంతా కేటీఆరే.. దానకిశోర్‌ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు!

నాగార్జున ఎన్-కన్వెన్షన్ ను కూల్చివేసిన రేవంత్ సర్కార్..

నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను రేవంత్ సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ విషయంపై నాగార్జున న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అక్రమించిన స్థలంలో  నిర్మించడంతోనే కూల్చివేశామని రేవంత్ సర్కార్ ఆ సమయంలో స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకులు సైతం ఈ విషయంపై అనేక సార్లు నాగార్జునపై విమర్శలు గుప్పించారు.

Also Read :  ఆ ఒక్కటి తప్పా అన్నీ ఓకే.. టాలీవుడ్ పెద్దలతో రేవంత్ ఏమన్నారంటే?

కొండా సురేఖ వ్యాఖ్యలతో దుమారం..

ఆ మంటలు చల్లారక ముందే.. మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై నాగార్జున ఫ్యామీలతో పాటు టాలీవుడ్ భగ్గుమంది. ఈ అంశంపై నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ వివాదాలు జరిగిన తర్వాత నాగార్జున సీఎం రేవంత్ ను కలవడం ఇదే తొలిసారి కావడంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also Read :  బలగం వేణుతో సాయి పల్లవి.. సినిమాకు గ్రీన్ సిగ్నల్

Also Read :  ఉక్రెయిన్‌ కు మరిన్ని ఆయుధాలిస్తామంటున్న బైడెన్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు