/rtv/media/media_files/2024/12/26/ZhmoNCFov69xKNYGdnGL.jpg)
tollywood and cm revanth reddy
టాలీవుడ్‌కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ సినీ ప్రముఖులతో జరుగుతున్న సమావేశంలో బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని.. టికెట్ రేట్ల పెంపు జరగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అనంతరం సంధ్య థియేటర్ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!
రాజీ పడేది లేదు
ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే.. తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్ల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటామని అన్నారు. అంతేకాకుండా అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని పేర్కొన్నారు.
ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?
ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని పేర్కొన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని చెప్పారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.
ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం!
ALSO READ: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి!