MLA Raja Singh : గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ తేల్చి చెప్పారు. తెలంగాణ బీజేపీ లో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయన్న రాజాసింగ్ త్వరలో పార్టీ అధిష్టానంతో చర్చిస్తానని, ఆ తర్వాత తాను తిరిగి బీజేపీలో చేరే విషయమై క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయన్నారు. తన రాజీనామాను అధిష్టానం ఆమోదించేలా పార్టీలోని నలుగురు నాయకులు కుట్ర చేశారని రాజాసింగ్ ఆరోపించారు.నా రాజీనామా పై హై కమాండ్ ఎంక్వైరీ చేస్తుంది అనుకున్నానని, అదెక్కడ జరగలేదని వాపోయాడు.అయితే ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పెద్దలు పిలుస్తారన్న నమ్మకం ఉందని, వారితో తన బాధలు చెప్పుకుంటానని, ఆ తర్వాతే తన నిర్ణయం వెల్లడిస్తానన్నారు. బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాజాసింగ్ అన్నారు. వారంతా బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నారన్నారు.
ఇది కూడా చూడండి: ఇదేం పద్ధతి.. ఉత్తమ్ పై కోమటిరెడ్డి ఫైర్.. అలిగి మధ్యలోనే ఇంటికి..
MLA Raja Singh Comments..
అమిత్ షా నాకు ఫోన్ చేశాడనే వార్తలో నిజం లేదన్నారు. తెలంగాణ బీజేపీ లో జరుగుతున్న అన్యాయంపై బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా వచ్చినప్పుడు చెప్పాను. అయితే అక్కడ ఎక్కువ సమయం దొరక్కపోవడంతో ఆయనకి పూర్తి విషయం చెప్పలేక పోయానన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజీనామా చేశానన్నారు. 11 ఏళ్లు నన్ను ఇబ్బందులు పెట్టిన భరించాను, ఇంకా ఎన్నాళ్లు భరించాలి? అందుకే రాజీనామా చేశానని రాజాసింగ్ స్పష్టం చేశారు.
నాకే కాదు బీజేపీ లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు కనీస మర్యాద దొరకడం లేదన్నారు.పార్టీలో అవమానాలు తట్టుకోలేకే జితేందర్ రెడ్డి, విజయశాంతి, నాగం జనార్ధనరెడ్డి వంటి నాయకులు బీజేపీని వదిలిఇతర పార్టీలోకి వెళ్లారని రాజాసింగ్ గుర్తు చేశారు. పార్టీలోకి తిరిగి రావాలని హై కమాండ్ ఆదేశిస్తే వెంటనే బీజేపీలో జాయిన్ అవుతానని స్పష్టం చేశారు. స్థానిక నాయకులు తనను పట్టించుకోకపోయినా కేంద్ర మంత్రులు తనతో టచ్‌లోనే ఉన్నారని రాజాసింగ్ చెప్పారు. ఇక తాను శివసేన, టీడీపీ, జనసేనలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. అవన్నీ బీజేపీ మిత్రపక్షాలేనని రాజాసింగ్ అన్నారు. మాధవీలత నాపై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా నని రాజాసింగ్ అన్నారు.
గోషామహల్ లో ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదని,ఒకవేళ పార్టీ రాజీనామా చేయాలని ఆదేశిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. అతేకానీ వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.నేను హిందుత్వ అజెండా తో రాజకీయాలు చేసే వ్యక్తినని, నా వాళ్ల పార్టీకి ఎప్పుడూ నష్టం జరగలేదన్న ఆయన మహారాష్ట్ర , కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీజేపీ కొరకు ప్రచారం చేశానన్నారు. నేను వెళ్లి మహారాష్ట్ర , కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీజేపీ కొరకు ప్రచారం చేశాను. అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ చాలా బాగా పెరిగిందని వివరించారు. పార్టీ కన్నా నేను ఎక్కువ అని ఎప్పుడూ అనుకోలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: సినీ నటి బూతు పురాణం.. 'సిగరెట్స్ ఏది రా' అంటూ రెచ్చిపోయి మరోసారి వార్తల్లోకి..?
goshamahal mla raja singh | BJP MLA Raja Singh Mass Warning | latest-telugu-news | telugu-news | latest telangana news
MLA Raja Singh : ఆ నలుగురు కుట్ర చేశారు...రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని ఎమ్మెల్యే రాజా సింగ్ తేల్చి చెప్పారు. తెలంగాణ బీజేపీ లో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయ అందుకే కొన్ని తప్పులు జరుగుతున్నాయన్నారు. తన రాజీనామా ఆమోదించేలా ఆ నలుగురు కుట్ర చేశారని ఆరోపించారు.
MLA Raja Singh