Actor Kalpika: సినీ నటి బూతు పురాణం.. 'సిగరెట్స్ ఏది రా' అంటూ రెచ్చిపోయి మరోసారి వార్తల్లోకి..?

సినీ నటి కల్పిక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌లో ఆమె సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి హంగామా చేశారు. మెను కార్డు, రూమ్ కీస్ మొహంపై విసిరేసి బూతు పురాణం స్టార్ట్ చేశారు. 'సిగరెట్స్ ఏది రా..' అంటూ రిసార్ట్స్ సిబ్బందిపై కల్పిక అరిచారు.

New Update

సినీ నటి కల్పిక మరోసారి వార్తల్లోకి నిలిచారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌లో ఆమె సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి హంగామా చేశారు. రిసార్ట్ మేనేజర్ కృష్ణ, సిబ్బందిపై మండిపడ్డారు. మెను కార్డు, రూమ్ కీస్ మొహంపై విసిరేసి బూతు పురాణం స్టార్ట్ చేశారు. 'సిగరెట్స్ ఏది రా..' అంటూ రిసార్ట్స్ సిబ్బందిపై కల్పిక అరిచారు. కేవలం 40 నిమిషాల్లో రిసార్ట్స్‌ మొత్తాన్ని అల్లకల్లోలం చేసేంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రిసార్ట్స్ సిబ్బంది తనతో తప్పుగా ప్రవర్తించారని బుకాయించింది. ఇప్పుడే కాదు.. గతంలో కూడా కల్పిక ఇలానే ఓ పబ్‌లో రచ్చ రచ్చ చేసింది. 

ఇది కూడా చూడండి:బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!

ఇటీవల ఓ రిసార్ట్స్‌లో..

ఇదిలా ఉండగా ఇటీవల ప్రిజం పబ్‌లో నటి కల్పిక సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన చేసిందని పబ్ యజమాన్యం గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేశారు. నటి కల్పిక ఇటీవల తన బర్త్ డే సందర్భంగా ప్రిజం పబ్‌కు వెళ్లింది.

ఇది కూడా చూడండి:New York Firing: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి

అక్కడ అర్థరాత్రి వరకు ఉండి బర్త్ డే వేడుకలను ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. అనంతరం పబ్ ముగింపు సమయంలో డిజర్ట్ విషయంలో ఆమె అభ్యంతరం తెలిపింది. దీంతో కల్పికకు, పబ్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో కల్పిక తన ఇన్‌స్టాలో లైవ్ పెట్టింది. పబ్ నిర్వాహకులు తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నంటూ లైవ్ వీడియోలో పేర్కొంది. 

ఇది కూడా చూడండి:Shocking: కుక్క ఫ్యామిలీకి రెసిడెన్సీ సర్టిఫికెట్‌.. ఎక్కడో తెలిస్తే షాక్!

అనంతరం ప్రిజం పబ్ నిర్వాహకులపై గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ గొడవను చూస్తూ ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరు చూసిన ఆమె మరింత రెచ్చిపోయింది. అనంతరం పోలీసులపై కూడా కొన్ని అసభ్యకర మాటలు విసిరింది. దీంతో ఈ గొడవ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పోలీస్ కేసు నమోదైంది. 

Advertisment
తాజా కథనాలు