/rtv/media/media_files/2025/07/29/komatireddy-vs-uttam-kumar-reddy-2025-07-29-12-27-55.jpg)
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రచ్చ మొదలైంది.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య తాజాగా వివాదం చోటు చేసుకుంది. ఈ రోజు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడానికి వీరిద్దరితో పాటు ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెళ్లాల్సి ఉంది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం వీరు ఉదయం 9 గంటలకు వీరు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి, లక్ష్మణ్ ఇద్దరూ 9 గంటల్లోగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 గంటలు దాటినా అక్కడికి రాలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను 9 గంటలకు రమ్మని.. ఉత్తమ్ 10 దాటినా ఇంకా రాకపోవడం ఏంటని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో అలిగి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ వద్దకు వచ్చారు ఉత్తమ్. అనంతరం మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి నాగార్జున సాగర్ కు వెళ్లారు.
ఇది కూడా చదవండి:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MLA టికెట్ వాళ్లకే.. తేల్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
Komatireddy Vs Uttam War
2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి అయ్యారు. ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో వెంకట్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమరణ దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఉత్తమ్ కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. తమ నేత వదిలేసిన మంత్రి పదవిని ఉత్తమ్ తీసుకున్నాడని కోమటిరెడ్డి వర్గీయులు ఆ సమయంలో విమర్శలు గుప్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారు. ఆ సమయంలో సైతం ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ కు మధ్య కూడా తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి.
ఇది కూడా చదవండి:TG New Ration Cards: కొత్త రేషన్‌కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
పీసీసీ చీఫ్ పదవి తమకు ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు హైకమాండ్ ను కోరారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కడం.. ఆయన సీఎం కూడా అవడం జరిగిపోయాయి. అనంతరం మంత్రి వర్గంలో ఉత్తమ్ తో పాటు కోమటిరెడ్డి ఇద్దరూ మంత్రులయ్యారు. అయితే.. కోమటిరెడ్డితో పోల్చితే ఉత్తమ్ ఎక్కువ పెత్తానం చెలాయిస్తున్నాడన్న టాక్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఉత్తమ్ డిప్యూటీ సీఎం తరహాలో వ్యవహరిస్తున్నాడన్న చర్చ కూడా ఉంది. కోమటిరెడ్డి కోపానికి ఇదే కారణమన్న గుసగులు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విభేదాలు ఇంతటితో ముగుస్తాయా? పెరిగి పెద్ద పంచాయితీగా మారుతాయా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే.. అందరు మంత్రులతో పోల్చితే ఉత్తమ్ ప్రభుత్వ హెలీకాప్టర్ ను అత్యధికంగా వినియోగిస్తున్నారన్న చర్చ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో సెటైర్లు కూడా అనేక సార్లు వచ్చాయి. ఇతర మంత్రులు ఈ విషయంపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.
telugu breaking news | komatireddy venkat reddy news | latest-telugu-news | latest telangana news