/rtv/media/media_files/2025/08/29/hyd-murder-2025-08-29-19-13-02.jpg)
HYD MURDER
Crime News : మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్త నేడు భార్యలకు చేదవుతున్నాడు. మధ్యలో వచ్చిన ప్రియుడే సర్వం అవుతున్నాడు. జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్తను కాటికి పంపి ప్రియుడితో కలిసి ఉండాలనే తలంపుతో దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో హత్య చేసి కటకటాల పాలవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 29) హైదరాబాద్ లో భర్తను చంపిన మరో ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది.
ఇది కూడా చదవండి:సాఫ్ట్‌వేర్ అంటూ మోసం చేసిన పానీపూరీ భర్త.. గర్భవతి అని చూడకుండా దారుణంగా ఏం చేశాడంటే?
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్ రోడ్ నెం. 7లో జెల్లెల శేఖర్ (40), చిట్టి(33) భార్యభర్తలు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అయితే చిట్టీ గత కొంత కాలంగా హరీష్ అనే వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో మొగున్ని వదిలించుకోవాలనుకున్న చిట్టీ గురువారం రాత్రి తన ప్రియుడుతో కలసి భర్తను హతమార్చింది. నిద్రిస్తున్న సమయంలో శేఖర్ గొంతు నులిమి హత్య చేసిన చిట్టి ఆ తర్వాత తలపై డంబెల్‌తో కొట్టి దారుణంగా చంపింది. ఆ తర్వాత అనుమానం రాకుండా ఉండేందుకు మధ్యాహ్నం 100 కు ఫోన్ చేసింది. రాత్రి నిద్రలోనే తన భర్త శేఖర్ చనిపోయినట్లు పోలీసులకు తెలిపింది.
ఇది కూడా చూడండి:CM Revanth Reddy : మేడిగడ్డ కూలింది. ఎల్లంపల్లే మనకు దిక్కు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అయితే సమాచారం తెలుసుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే మృతుని భార్య చిట్టిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ మధ్య అన్ని అటువంటి ఘటనలే జరగుతుండటంతో తమదైన శైలిలో చిట్టిని విచారించారు.. అప్పుడుగానీ అసలు విషయం బయటకు రాలేదు. ఎట్టకేలకు తన ప్రియుడు తో కలిసి భర్త ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో చిట్టీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రియుడు హరీష్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి శేఖర్ మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Also Read : Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!