/rtv/media/media_files/2025/09/16/the-wife-poured-boiling-oil-on-her-husband-2025-09-16-11-00-57.jpg)
The wife poured boiling oil on her husband..
Crime News :ఇటీవల కాలంలో భార్యభర్తల గొడవల్లో భర్తలను దారుణంగా హత్య చేస్తున్న విషయం తెలిసిందే. అక్రమసంబంధాలు, ఆర్థిక కారణాలతో భర్తలను భార్యలు చంపేస్తున్నారు. అలాంటిదే జోగులాంబ గద్వాల జిల్లాలో మరోకటి చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య వచ్చిన గొడవల నేపథ్యంలో ఆవేశానికి గురైన భార్య భర్తపై మరుగుతున్న నూనె పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త చికిత్సపొందుతూ మృతి చెందాడు. పోలీసులు, వారి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జోగుళాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వెంకటేష్ ,పద్మ భార్యభర్తలు. కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పెద్దల జోక్యంతో సద్దుమణుగుతున్నాయి.
Also Read: చీరకొంగునే ఆయుధంగా మలిచి...నక్కతో 65 ఏళ్ల వృద్దురాలు బిగ్ ఫైట్
ఇదిలా ఉండగా ఈ నెల 11వ తేదీన వెంకటేష్ పద్మల మధ్య మరోసారి గొడవజరిగింది. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఒక దశలో వెంకటేశ్ పద్మమీద చేయిచేసుకున్నాడు. దీంతో ఆవేశానికి గురైన పద్మ భర్తపై కాలుతున్న వేడి నూనే పోసింది. ఒక్కసారిగా వేడి నూనె మీద పోయడంతో వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు వెంకటేష్‌ను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం వెంకటేష్ మృతి చెందాడు. వెంకటేష్ , పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. మృతదేహన్ని పోస్టమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇది కూడా చూడండి:Hyderabad: కొంప ముంచిన ఇన్‌స్టాగ్రామ్.. ఆ రీల్ చూసి ఫాలో అవుతే ఏం జరిగిందంటే..