/rtv/media/media_files/2025/04/03/bZfENuoXFYnJRHzd3CEd.jpg)
ganesh
Telangana Police : మండపాల వద్ద ఇసుక సంచులు, నీటి డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. పీవోపీ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను పెట్టి పర్యావరణానికి సహకరించాలని కోరారు. నిమజ్జన చివరి రోజున రద్దీని తగ్గించేందుకు వినాయకుడని నిలిపిన తర్వాత మూడు లేదా 5, 7రోజున నిమజ్జనం చేసుకునే విధంగా అందరూ ప్లాన్ చేసుకోవాలన్నారు. ఫిట్ నెస్ ఉన్న వాహనాలను మాత్రమే నిమజ్జనానికి ఉపయోగించాలని సూచించారు. ముందస్తు అనుమతులతో మాత్రమే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, డీజేలకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
మతపరమైన ప్రదేశాల వద్ద జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు అంటించడం, ఏర్పాటు చేయడం చేయరాదని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ లు వినియోగించడం నిషేధమని స్పష్టం చేశారు. విరాళాలు స్వచ్ఛందంగా మాత్రమే తీసుకోవాలని ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని మండపాల నిర్వహకులకు సూచించారు. అలాగే మండలాల వద్ద మద్యం సేవించడం చేయరాదని, జూదం వంటి ఇతర చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడ రాదని, అలా చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. డీజే పర్మిషన్ లేదని గుర్తుంచుకోండి. నిర్వాహకులు తప్పనిసరిగా https://policeportal.tspolice.gov.in/index.htm లో పర్మిషన్ కోసం అప్లై చేసుకొని, అనుమతి తీసుకోవాలి అని పోలీసులు కోరుతున్నారు.