Harassment of Hijras : బరితెగించిన హిజ్రాలు..డబ్బులు ఇవ్వలేదని..అది లేపి(వీడియో)

హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయి. రాచ‌కొండ సీపీ ప‌రిధిలోని గుర్రంగూడ‌లో ఆదివారం ఓ భూమి పూజ జ‌ర‌గ్గా అక్కడ‌కు వెళ్లిన కొందరు హిజ్రాలు నానా హంగామా చేశారు.  అడిగినంత డ‌బ్బులు ఇవ్వక‌పోవ‌డంతో యాజమానులను బూతులు తిడుతూ బట్టలు పైకెత్తుతూ నానా రభస చేశారు.

New Update
Harassment of Hijras

Harassment of Hijras

Harassment of Hijras : హిజ్రాల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, రైల్వేస్టేషన్లు, రైళ్లు ఇలా ఎక్కడ చూసిన వారే కనిపిస్తున్నారు. ఇక ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే బంధువుల కంటే ముందే హిజ్రాలు ప్రత్యక్షమవుతున్నారు. ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఐదో పదో కాకుండా వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు. అది చిన్న పంక్షనా, పెద్దదా అనేది వారికి అవసరం లేదు. అడిగినంత ఇవ్వాల్సిందే. లేదంటే వికృతచేష్టలతో అక్కడ ఉన్నవారిని తల  దించుకునేలా చేస్తున్నారు.అలాంటి ఘ‌ట‌నే రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ‌లో చోటు చేసుకుంది. రాచ‌కొండ సీపీ ప‌రిధిలోని గుర్రంగూడ‌లో ఆదివారం ఓ భూమి పూజ జ‌ర‌గ్గా అక్కడ‌కు వెళ్లిన కొందరు హిజ్రాలు నానా హంగామా చేశారు.  అడిగినంత డ‌బ్బులు ఇవ్వక‌పోవ‌డంతో యాజమానులను బూతులు తిడుతూ బట్టలు పైకెత్తుతూ నానా రభస చేశారు. ఈ విషయంపై ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని రాచకొండ సీపీకి ట్యాగ్ చేశాడు.

Also Read: ట్రంప్‌ను తిడుతూ.. వలసదారులకు స్వాగతం అంటున్న అమెరికన్ పౌరులు
 
ఆయన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. ఒకప్పుడు కొజ్జా వాళ్ళంటే గౌరవం,వాళ్ళ ఆశీర్వాదం కావాలని ఉండేది,వాళ్ళతో తిట్లు పడొద్దు అనే సెంటిమెంట్ ఉండేది. కానీ ఈమధ్య వీళ్ళ దౌర్జన్యాలు శృతిమించిపోతున్నాయి.శుభకార్యాల వద్దకు వచ్చి ఇష్టమొచ్చినట్లు డబ్బులు డిమాండ్ చేయడం,ఇయ్యకపోతే చిన్న పిల్లలు ఉన్నారనే ఇంకిత జ్ఞానం లేకుండా బట్టలు విప్పి నిలబడి వికృత చేష్టలు చేయడం,శుభకార్యం వద్ద బూతులు తిట్టి అశుభం జరగాలని శపించడం మితిమీరిపోతుంది.

Also Read: BIG BREAKING: తిరుమలలో అగ్ని ప్రమాదం!

వీళ్ళు ఈరోజు గుర్రంగూడ పరిధిలో భూమిపూజ వద్ద అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన నా దృష్టికి వచ్చింది.ఈ సమస్యను ప్రతి హిందువు ఎదుర్కొంటున్నాడు.పై వ్యక్తులపై చట్టపరమైన చర్యల కోసం నేను ఈ పోస్టు పెట్టడం లేదు, కానీ సంబంధిత హిజ్రా సంఘాలు మరియు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ హిందువులు శుభకార్యాల పూట సంతోషంగా ఉండేలా చూడాలి, వాళ్ళు కూడా ఎవరు ఎంత సంతోషంగా ఇస్తే అంత తీసుకొని ఆశీర్వదించాలి.ఈ అసభ్యకర పోకడకు ముగింపు పలకాలి లేకుంటే హిందువులు శుభకార్యాలు చేసుకోవాలంటే  భయపడే పరిస్థితులు దాపురించాయి.హిందూ ధర్మం లో ఒక గౌరవమైన స్థానం ఉన్న హిజ్రా వ్యవస్థ ఇటీవల వాళ్ళపై దాడులు చేయించుకొనే పరిస్థితి కల్పించుకుంటుంది.పోలీస్ స్టేషన్ వారిగా హిజ్రా సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి కౌన్సిలింగ్ నిర్వహించి సభ్య సమాజం ఇబ్బందులకు గురవుతున్న పై సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి.

Also Read:Musk-India:-Modi: త్వరలోనే ఇండియాకు రాబోతున్నా..: ఎలాన్ మస్క్

కాగా ఈ పోస్ట్ పై మీర్ పేట్ పోలీసులు రిప్లై ఇస్తూ అక్కడకు పోలీసులు వెళ్లారని సమస్య పరిష్కారం అయిందని పేర్కొన్నారు. కానీ నెటిజన్ పోలీసులు అబద్దం చెబుతున్నారని అసలు అక్కడకు ఎవరూ వెళ్లలేదని ఘటనపై కేసు నమోదు చేసుకోలేదని మరోసారి సీపీకి ఫిర్యాదు చేశారు.

Also Read: Telangana: వదలని వర్షాలు.. మరో 2 రోజులు వానలే..వానలు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు