/rtv/media/media_files/2025/02/22/oUvNs0SPcivZYnxo8Grk.jpg)
TGSRTC announced 3 thousand special buses for mahashivratri
Mahashivratri Special Buses
మహా శివరాత్రి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26న మహా శివరాత్రి సందర్భంగా 24 నుంచి 28వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది.
ప్రాంతాల వారీగా
అందులో శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి.
- మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు
— PRO, TGSRTC (@PROTGSRTC) February 22, 2025
- శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు
- భక్తులకు ఇబ్బందులు కలగకుండా #TGSRTC ఏర్పాట్లు@TGSRTCHQ @Ponnam_INC @TelanganaCMO @revanth_anumula pic.twitter.com/khUbTnSDrA
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
50 శాతం వరకు సవరింపు
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ జీవో విడుదల చేసింది. శివరాత్రికి నడిచే ఈ స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది. దాదాపు 50 శాతం వరకు టికెట్ ధరలను సవరించింది. అయితే రెగ్యులర్ సర్వీస్ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండవని పేర్కొంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు (నాలుగు రోజులు) నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
ఫుల్ డీటెయిల్స్ కోసం
ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 26 నుంచి 28 తేది వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. ఇక ఈ స్పెషల్ బస్సుల్లో.. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుంది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే స్పెషల్ బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించారు. టికెట్ల బుకింగ్ ను www.fgsrtcbus.in వెబ్సైట్ లో చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇతర సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 ను సంప్రదించాలి.