/rtv/media/media_files/2025/03/31/mUFWesLMFGAaUjR8wVRC.jpg)
TG Weather Update
తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది. మరికొద్ది సేపట్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురేసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడనున్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో వెల్లడించింది.
Also Read: టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్,యూనస్...భారతీయులకు దక్కని ప్లేస్!
ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు
రాత్రి 7 గంటల లోపు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వాన పడుతుందని అంచనా వేసింది. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎవరూ కూడా ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ సాయంత్రం వడగళ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే.
కాగా తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మాడు పగిలే ఎండలు కొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు.. తూర్పు రాజస్థాన్ నుండి మన్నార్ గల్ఫ్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పాటు, తూర్పు మధ్యప్రదేశ్ వద్ద కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గురువారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రోజు గరిష్టంగా మెదక్‌లో 41.9 డిగ్రీలు, కనిష్టంగా భద్రాచలంలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
Also Read: 247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!
TG Weather Updates | hyderabad weather report | IMD weather report | latest-telugu-news | telugu-news