/rtv/media/media_files/2024/12/17/wJzsdG0WEh17U8o3yNaP.jpg)
Weather update
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా అకాల వర్షాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు వెను వెంటనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షం కురిసిన వెంటనే ఎండలు మండిపోతున్నాయి. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి.
Also read : తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. అది తేలితేనే ఫలితాలు !
అప్పుడే భగభగమండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అప్పటికప్పుడే వాతావరణం చల్లబడిపోయి వర్షం కురిసేస్తుంది. దీంతో ఎండలు ఎప్పుడు ఎక్కుతాయో.. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాబోయే రెండు రోజులు భిన్నవాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది.
Also read : పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!
రెండు రోజులు జాగ్రత్త
ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. ఇందులో భాగంగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 - 50 కి.మీ, మరికొన్ని జిల్లాల్లో గంటకు 30 - 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Also read : ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
ఎందుకంటే ఈ 2 డేస్ పలు జిల్లాల్లో గంటకు 30 - 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. దానితో పాటు ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నాయని చెప్పుకొచ్చింది. వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే మరోవైపు ఎండలు కూడా మండిపోనున్నట్లు తెలిపింది. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది.
Also read : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!
TG Weather Updates | hyderabad weather today | hyderabad weather report | latest-telugu-news | telugu-news