/rtv/media/media_files/2025/06/08/aqV1vs8LMHEikJFHLcjh.jpg)
TG Cabinet Expansion
TG Cabinet Expansion:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల పేర్లు ప్రకటించారు. కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వారికి నా అభినందనలు అన్ని ట్వీట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటల 19 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నూతన మంత్రులుగా
— Revanth Reddy (@revanth_anumula) June 8, 2025
బాధ్యతలు స్వీకరించబోతున్న
శ్రీ వివేక్ వెంకట స్వామి గారు,
శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు,
శ్రీ వాకిటి శ్రీహరి గారి కి
నా అభినందనలు.
శాసన సభ లోఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ రామచంద్రు నాయక్ గారి కి
నా అభినందనలు.
శ్రీ వివేక్ వెంకట స్వామి గారు,
శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు,
శ్రీ వాకిటి శ్రీహరి గారి కి
నా అభినందనలు.శాసన సభలో ఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ రామచంద్రు నాయక్‌కి నా అభినందనలు
-
Jun 08, 2025 13:46 IST
Cabinet expansion : కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు..మరో 12 మంది...
-
Jun 08, 2025 13:46 IST
Cabinet expansion : ఇంకా మిగిలే ఉంది...కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం
-
Jun 08, 2025 12:43 IST
New Ministers : కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Jun 08, 2025 12:24 IST
Cabinet Expansion
Telangana Cabinet Expansion @revanth_anumula అన్న నాయకత్వంలో సామజిక న్యాయానికి పెద్ద పీట...🙏
— Rising_TG (@Rising_TG) June 8, 2025
✅ Vakiti Srihari Mudiraj - వాకిటి శ్రీహరి (ముదిరాజ్) #VakitiSrihari
✅ Gaddam Vivek - గడ్డం వివేక్ (మాల) @VivekVenkatswam
✅ Adluri Laxman - అడ్లూరి లక్ష్మణ్ (మాదిగ) @Adluri12 pic.twitter.com/VCgPzcPN0I -
Jun 08, 2025 12:23 IST
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి
-
Jun 08, 2025 12:22 IST
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్
-
Jun 08, 2025 12:18 IST
Kavvampally Satyanarayana : పాపం కవ్వంపల్లి
-
Jun 08, 2025 12:17 IST
Cabinet expansion: కేబినెట్లో సామాజిక వర్గాలకి కేటాయింపు.. ఈ ముగ్గురే ఎందుకంటే?
-
Jun 08, 2025 12:17 IST
మంత్రిగా వివేక్ ప్రమాణ స్వీకారం
-
Jun 08, 2025 12:17 IST
SC MLAs : పట్టుపట్టి సాధించిన ఎస్సీ ఎమ్మెల్యేలు
-
Jun 08, 2025 11:14 IST
కొత్తమంత్రుల పేర్లను ప్రకటించిన రేవంత్
కొత్తమంత్రలుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్రు నాయక్ కి విషెస్ తెలిపారు.
-
Jun 08, 2025 11:14 IST
కొత్త మంత్రులకు కలిసొచ్చిన అంశాలివే!
మంత్రివర్గ విస్తరణలో బీసీల నుంచి వాకిటి శ్రీహరి, మాలల నుంచి వివేక్, మాదిగల నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కు చోటు లభించింది. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేలు కాగా ఆయా సామాజికవర్గాల్లోనూ వీరికంటే సీనియర్లు లేకపోవడం కలిసివచ్చింది. డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామ్ చందర్ నాయక్ కూడా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేనే.
-
Jun 08, 2025 11:14 IST
ఒకే ఇంట్లో ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి
తెలంగాణ రాజకీయాల్లో ఒకే కుటుంబంలో ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఉండటం ఆసక్తిని సంతరించుకుంది. గడ్డం వెంకటస్వామి కుమారులు వినోద్, వివేక్ లు ఎమ్మెల్యేలు ఉండగా, అందులో వివేక్ కు ఇప్పుడు మంత్రి పదవి వరించింది. వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్నారు.
-
Jun 08, 2025 11:13 IST
నిజామాబాద్కు మళ్లీ నిరాశే!
మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమంటూ ఊహాగానాలు భారీగానే వినిపించాయి. మరి తదుపరి విస్తరణలో ఆయనకు చోటు దక్కుతుందో లేదో చూడాలి.
-
Jun 08, 2025 11:13 IST
ఈ రోజే కేబినెట్ విస్తరణ ఎందుకు?
రాష్ట్ర కేబినెట్లో మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం 3 బెర్త్లను భర్తీ చేస్తున్నారు. వివేక్, లక్ష్మణ్,శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఆదివారం మృగశిర కార్తె కావడం, మంచి ముహూర్తం ఉండడంతో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన 3బెర్త్లను త్వరలో భర్తీ చేయనున్నారు.
-
Jun 08, 2025 11:13 IST
పార్టీ విధేయుడికి దక్కిన గౌరవం
రాష్ట్ర కేబినెట్లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కి చోటు దక్కింది. 1982లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎన్‌ఎస్‌యూ ఐఅధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1999 నుంచి 2018 వరకు వరుసగా పోటీ చేస్తూ ఓడిపోయారు. ఓడిపోయిన ఆయన ఏనాడూ పార్టీ మారలేదు. 2023 ఎన్నికల్లో తొలిసారి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. డిసెంబర్ 15న ప్రభుత్వ విప్‌గా ప్రభుత్వం నియమించింది.
-
Jun 08, 2025 10:47 IST
రాజ్ భవన్‌కు కొత్త మంత్రుల పేర్లు.. మధ్యాహ్నం ప్రమాణస్వీకారం