/rtv/media/media_files/2025/06/08/3uu4V5tDSsePL7Kn2ZNF.jpg)
Congress Mlas Resign?
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తమకు అవకాశం వస్తుందని ఆశిస్తూ వస్తున్న పలువురు నేతలకు నిరాశే మిగిలింది. క్యాబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీ ఉండగా వాటిలో కేవలం మూడు మాత్రమే భర్తీ చేశారు. వాటిలో ఎస్సీ మాల, మాదిగలకు రెండు, బీసీలకు ఒకటి కేటాయించారు. ఇంకా మూడు బెర్తులు ఖాళీ ఉన్నప్పటికీ అవి ఎవరికీ దక్కుతాయన్న దానిపై క్లారిటీ లేదు. దీంతో పదవులు దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు.
Also Read : రేపట్నుంచి AP PGCET 2025 పరీక్షలు - ఫుల్ షెడ్యూల్ ఇదే
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి
Flames Of Discontent In The Congress Party
తమకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన వారిలో 1)ప్రేమ్ సాగర్ రావు, 2) రాజగోపాల్ రెడ్డి, 3)మల్ రెడ్డి రంగారెడ్డి, 4)రామ్మోహన్ రెడ్డి, 5) సుదర్శన్ రెడ్డి, 6) బాలు నాయక్, 7) విజయశాంతి, 8) అద్దంకి దయాకర్, 9) MLC అమీర్ అలీ ఖాన్, 10) ఆది శ్రీనివాస్,11) బీర్ల ఐలయ్య, 12) మదన్ మోహన్ రావు తదితరులున్నారు.కాగా అసంతృప్తులను బుజ్జగించేందుకు పీసీసీ నేతలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు వెళ్లి ఆయనను బుజ్జగించారు.రాజీనామా చేస్తానంటూ అనుచరులతో సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని ప్రస్తుతానికి సహకరించాలని నేతలు కోరారు. కష్టకాలంలో పార్టీ కి అండగా ఉన్నాను... నన్ను కూడా సామాజిక కోణంలో చూసి పక్కన బెట్టడమేంటని సుదర్శన్ రెడ్డి నిలదీశారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పీసీసీ నేతలు వారిని కోరినట్టు తెలిసింది.
Also Read : తెలంగాణలో ఉరుములు మెరుపులతో దంచికొడుతున్న వర్షం.. ఈ జిల్లాల్లో దారుణం! (వీడియో)
telangana-cabinet-expansion | | New Ministers in Telangana Cabinet | telangana cabinet ministers | Telangana Cabinet New Ministers List | telangana cabinet today