Telangana Cabinet: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌ లో రాష్ట్రగవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

New Update
New Ministers

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌ లో ఈ  ఉదయం 12 గంటల సమయంలో రాష్ట్రగవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఈ రోజు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని నిన్నటినుంచి ప్రచారం సాగుతుండగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించారు. కాగా చివరికి సామాజిక వర్గాల వారిగా ఎస్సీ మాల నుంచి వివేక్, మాదిగ నుంచి అడ్లూరి, బీసీ నుంచి వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు దక్కాయి.

Also Read :  రేపట్నుంచి AP PGCET 2025 పరీక్షలు - ఫుల్ షెడ్యూల్ ఇదే

Also Read :  పబ్లిక్ టాక్ కోసం నేరుగా రంగంలోకి దిగిన స్టార్ హీరో!

Swearing New Ministers

కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read :  2 నెలల్లోనే ట్రంప్‌కు 5సార్లు కోర్టులో ఎదురుదెబ్బలు

Also Read :  ఏపీలో తీవ్రవిషాదం. . ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతు

telangana-cabinet-expansion | telangana cabinet ministers | Telangana Cabinet New Ministers List | telangana cabinet today

Advertisment
Advertisment
తాజా కథనాలు