/rtv/media/media_files/2025/07/29/youth-hangs-himself-2025-07-29-16-26-43.jpg)
A young man committed suicide by hanging himself.
హైదరాబాద్‌లో అల్లరిమూకల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. దాడులు, దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లు, అర్థరాత్రుళ్లు గంజాయి సేవించి దారికాచి అటకాయించడం సర్వసాధారణమైంది. ఖైరతాబాద్‌లో ఓ రౌడీమూక రెచ్చిపోయింది. బ్యానర్ విషయంలో జరిగిన చిన్న విషయమై జరిగిన గొడవలో ఓ యువకున్ని ఆ గ్యాంగ్ చితకబాదడంతో అవమానంగా భావించిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఖైరతాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.
Also Read : తమ్మునికి నయంకాని వ్యాధి.. కడతేర్చిన అక్క
Rowdy Mob Attacks In Khairatabad
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ న్యూ సీఐబీ క్వార్టర్స్ లో నివాసం ఉండే వీరబోయిన ముఖేష్ బాబు అనే యువకుడు స్థానికంగా పాలు, ఐస్‌క్రీం వ్యాపారం చేసుకుంటున్నాడు. అంతేకాక స్థానిక గజ్జెలమ్మ దేవాలయం నిర్వాహక కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నాడు.బోనాల పండుగ సందర్భంగా బ్యానర్లు కట్టే విషయంలో స్థానికంగా ఉండే ఒక గ్యాంగ్ లీడర్ వికేష్‌తో పాటు అతని అనుచరులకు ముఖేష్‌కు మధ్య మూడురోజులుగా గొడవ జరుగుతుంది. ఆదివారం రాత్రి కూడా కొందరు వికేష్ అనుచరులు ముఖేష్ దుకాణం దగ్గరకు వచ్చి ఆయనతో గొడవకు దిగారు. అయితే స్థానికులు జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది, అయితే అక్కడి నుంచి వెళ్లి పోయిన ఆ గ్యాంగ్ మరికొంతమందిని తీసుకుని వచ్చి ముఖేష్‌పై దాడి చేశారు.
దాడి చేస్తున్న సమయంలో ముఖేష్‌ను తీవ్ర పరుషపదజాలంతో దూషించారు. దీంతో ముఖేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. షాపు నుంచి ఇంటికి వచ్చిన ముఖేష్ ఉరేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వికేష్, అతని అనుచరుల దాడి వల్లే ఆత్యహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే ముఖేష్ ఆత్మహత్య విషయం తెలిసి అక్కడికి చేరుకున్న స్థానికులు వికేష్‌తో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. పెద్ద సంఖ్యలో గుమికూడిన ప్రజలు పోలీసులపైకి దూసుకువచ్చారు. ముఖేష్ పై దాడి చేయడంతో పాటు అందరిముందు అతన్ని చంపేస్తామని బెదిరించడం వల్ల అవమానంగా భావించిన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు.పోలీసుల అండతోనే వికేష్ అనుచరులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. వారి అండతోనే సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.
కాగా ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. అందరితో కలిసిమెలసి ఉండే ముఖేష్ చాలా మృదుస్వభావి అని, దేవాలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. అలాంటి వ్యక్తిపై దాడి చేసి అతని చావుకు కారణమైన వారిని వదల వద్దని వారు డిమాండ్ చేశారు. వికేష్ గ్యాంగ్ ఖైరతాబాద్ లో అనేక దౌర్జన్యాలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. కాగా ముఖేష్ ఆత్మహత్యకు సంఘీభావంగా రేపు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడానికి స్థానికులు, ముదిరాజ్ సంఘాలు సిద్ధమవుతున్నాయి. కాగా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పోలీసులను డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: ఖమ్మంలో అర్థరాత్రి హైటెన్షన్ .. ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమాస్పద మృతి!
telugu crime news | latest telangana news | latest-telugu-news | hyderabad