/rtv/media/media_files/2025/12/19/andhra-pradesh-2025-12-19-18-58-07.jpg)
Can Andhra pradesh rare earth corridor fuel india's clean energy dream, Know details
ఆంధ్రప్రదేశ్‌లోని బీచ్‌లు, ఫిషింగ్ హర్బర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తాయి. అక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇంతపెద్ద తీర ప్రాంతంలో ఎంతో విలువైన, అత్యంత అరుదైన ఖనిజాలు బయటపడ్డాయి. ఇవి దేశ రక్షణ, సెమికండక్టర్ రంగంలో కీలక మార్పులు తీసుకురానున్నాయి. ఇక్కడి బీచ్ ఇసుకలో మోనటైజ్ అనే అరుదైన భూ పదార్థం నిల్వలు విస్తారంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఇల్మెనైట్, రూటిల్, జిర్కాన్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి విలువైన ఖనిజాలు కూడా ఇక్కడ లభించాయి.
ఈ తీరప్రాంతంలో తవ్విన మోనాజైట్‌లో 55-60 శాతం అరుదైన మూలకాలు ఉన్నాయి. వీటిని ప్రపంచంలోనే అత్యంత విలువైన భూ ఖనిజాలుగా భావిస్తారు. ఇందులో 8-10 శాతం థోరియం కూడా ఉంటుంది. ఈ ఖనిజాలు తర్వాతి తరం న్యూక్లియర్ రియాక్టర్ల తయారీకి ఎంతగానో ఊతమివ్వనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన యువ నేత మృతి.. అట్టుడుకుతున్న బంగ్లాదేశ్
మోనాజైట్‌లో చూసుకుంటే లాంతనం, సీరియం, నియోడైమియం, ప్రసోడైమియం, సమారియం, యూరోపియం, గాడోలినియం వంటి తేలికపాటి మూలకాలు ఉంటాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్‌లు, క్షిపణి మార్గదర్శక వ్యవస్థలు, శాటిలైట్ వ్యవస్థలు, ఫైబర్ ఆప్టిక్స్, సూపర్‌కండక్టర్లు అలాగే ఆధునిక వైద్య పరికరాల్లో కీలకంగా వాడుతుంటారు. భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం, చీరాల, వోడరేవు, రామాయపట్నం, దుగరాజపట్నం వంటి ప్రాంతాలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఈ ఖనిజాల పట్టీ విస్తరించి ఉన్నట్లు జియోలాజికల్ సర్వేలో తేలింది.
భారత్‌లో 12 నుంచి 15 మిలియన్ టన్నుల మోనాజైట్‌తో పాటు 300 మిలియన్ టన్నులకు పైగా ఇల్మెనైట్, రూటిల్, జిర్కాన్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి విలువైన ఖనిజాలు ఉన్నట్లు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అండ్ ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) అంచనా వేసింది. ఇవి 40 నుంచి 50 శాతం వరకు అవసరమయ్యే దేశీయ అరుదైన భూ ఖనిజాలుగా దశాబ్దాలుగా ఉపయోగపడనున్నాయి. భారత్‌లో ఉండే మోనటైజ్ నిల్వల్లో ఏపీ నుంచే 30 నుంచి 35 శాతం అంటే దాదాపు 3.7మిలియన్ టన్నులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ అవకాశాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC) ఈ అరుదైన ఖనిజాలను తవ్వితీసే పనిలోకి దిగింది. కేంద్రం కూడా 16000 హెక్టార్ల బీచ్ ఇసుక మైనింగ్ కోసం లీజును మంజూరు చేసింది. మోనజైట్‌ను వెలికితీసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) మాత్రమే నిర్వహిస్తుంది. ప్రైవేట్ కంపెనీలు ఇతర ఖనిజాలను తవ్వొచ్చు. మోనజైట్‌ను మాత్రం వేరు చేసి IRELకి అప్పగించాలి. అయితే IREL నెల్లూరులోని గూడూరులో ఏటా 10,000 టన్నులను సేకరించే మోనజైట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2026లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
ఇదిలాఉండగా ప్రస్తుతం చైనా ఇలాంటి అరుదైన భూ ఖనిజాలు 85 శాతం వరకు నియంత్రిస్తోంది. ఏపీలో గుర్తించిన ఈ అరుదైన ఖనిజాలు మనం చైనాతో పాటు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా భారత్ పెట్టుకున్న క్లీన్ ఎనర్జీ టార్గెట్‌ను అంటే శిలాజ ఇంధనేతర వనరులను సాధించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు రక్షణ రంగానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. దీంతో పాకిస్థాన్ కూడా వణికిపోయే పరిస్థితులు రావొచ్చు.
Follow Us