Rajasthan: నువ్వసలు మనిషివేనా? ప్రియుడు వెక్కిరించాడని..కన్నబిడ్డను సరస్సులో పడేసి చంపిన తల్లి

మాతృత్వం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలు సైతం తమ పిల్లల్ని పరాయివారు ముట్టుకుంటే సహించవు. అలాంటిది మాతృత్వానికే మచ్చతెచ్చేలా ఓ తల్లి దారుణానికి పాల్పడింది. తన ప్రియుడు వెక్కిరించాడని బిడ్డను సరస్సులో పడేసి చంపేసింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిందీ ఘోరం.

New Update
Mother kills baby by throwing him into lake

Mother kills baby by throwing him into lake

Rajasthan: మాతృత్వం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలు సైతం తమ పిల్లల్ని పరాయివారు ముట్టుకుంటే సహించవు. అలాంటిది మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ఓ తల్లి దారుణానికి పాల్పడింది. తన ప్రియుడు వెక్కిరించాడని బిడ్డను సరస్సులో పడేసి చంపేసింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌ లో జరిగిందీ ఘోరం.  నిద్రపోతున్న మూడేళ్ల పాపను ప్రియుడి మాట విని సరస్సులో పడేసింది. రాజస్థాన్‌ లోని అజ్మీర్‌ నగరంలో ఉన్న చారిత్రాత్మక అన్నా సాగర్ సరస్సులో ఓ బాలిక మృతదేహం కనిపించింది. దీంతో స్థానికంగా కలకలం రేపింది. విషయం పోలీసులుకు తెలియడంతో క్రిస్టియన్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో బాలిక మృతదేహాన్ని సరస్సు నుంచి బయటకు తీయించారు. గుర్తుతెలియని బాలికగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తరువాత ఆ బాలిక మృతదేహాన్ని జేఎల్​ఎన్​ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు ప్రారంభించారు. 

కేసు విచారణలో భాగంగా  పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పాప తల్లి అంజలీసింగ్‌ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా  దీనిపై క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్​ఛార్జ్​ అరవింద్​ చరణ్ మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నాం" అని వివరించారు. కాగా అంజలీ సింగ్‌ తన భర్తను వదిలేసి ఒక రెస్టారెంట్లో పనిచేసే అఖిలేశ్‌ అనే వ్యక్తితో కలిసి ఉంటోందని తెలిపారు. ఇద్దరి మధ్య సంబందానికి కుమార్తె అడ్డుగా ఉందని అఖిలేశ్‌ చెప్పడంతో రాత్రివేళ పాపను తీసుకుని సరస్సు వద్దకు చేరుకుంది. పాప వేలు పట్టుకొని సరస్సు చుట్టూ తిప్పుతూ కబుర్లు చెప్పిందిజ అనంతరం ఆ చిన్నారి నిద్రపోయాక పాపను సరస్సులో పడేసిందని వివరించారు.  

ఈ విషయమై  క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్​ఛార్జ్​ అరవింద్​ చరణ్  మాట్లాడుతూ  "బాలిక మృతదేహం సరస్సులో కనిపించిన తరువాత మేము దర్యాప్తు ప్రారంభించాం. ఘటనా స్థలం చుట్టూ ఉన్న  సీసీటీవీ కెమెరాలను పరిశీలించాం. ఓ సీసీటీవీ ఫుటేజ్​లో సెప్టెంబర్ 16న రాత్రి సమయంలో ఓ మహిళ, ఒక చిన్నారిని తీసుకుని చౌపట్టి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించిందని వివరించారు.  అదే సమయంలో మరో  సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే  అందులో మహిళ ఒక్కరే కనిపించారు. ఆమె చేతిలో పాప కనిపించలేదు. దీనితో అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నాం. అనంతరం విచారించగా సరస్సులో దొరికిన బిడ్డ నిందితురాలి కన్న కూతురు అని తేలింది. కాగా, తన  ప్రియుడు వెక్కిరించాడనే కారణంతో, నిందితురాలు నిద్రపోతున్న మూడేళ్ల కన్న కూతురిని సరస్సులో విసిరేసినట్లు తేలిందన్నారు. విచారణలో ఇంకా అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. నిందితురాలు అంజలీ సింగ్​ భర్తను వదిలేసి వారణాసిలో నివాసం ఉండేది. ఈ క్రమంలో ఆమెకు అఖిలేశ్​ అనే వ్యక్తితో  పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అఖిలేశ్ ఒక రెస్టారెంట్​లో పనిచేస్తున్నాడు.  ఆ తరువాత వారిద్దరూ వారణాసి నుంచి అజ్మీర్​కు వలస వచ్చారు. మా కానిస్టేబుల్​ గోవింద్ శర్మ పెట్రోలింగ్​కు వెళ్లినప్పుడు సెప్టెంబర్​ 17న మార్నింగ్‌ 4 గంటల సమయంలో అఖిలేశ్‌, అంజలి  ఇద్దరూ అన్నా సాగర్​ సరస్సు వద్ద అనుమానస్పదంగా కనిపించారు. దీంతో కానిస్టేబుల్‌ వారిని ఇక్కడ ఏం చేస్తున్నారు? అడిగితే, తమ బిడ్డ రాత్రి 10 గంటల సమయంలో తప్పిపోయిందని, ఆమె కోసం వెతుకుతున్నామని చెప్పినట్లు అరవింద్‌ తెలిపారు వారి తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో, కానిస్టేబుల్ ఈ విషయాన్ని  పోలీస్ స్టేషన్​లో చెప్పారు.  ఆ తరువాత పాప మృతదేహం సరస్సులో కనిపించడంతో విషయం బయటకు వచ్చింది. దర్యాప్తు చేయగా కన్న తల్లి, ఆమె ప్రియుడు ఈ హత్య చేసినట్లు తేలిందన్నారు. ఇంకా కేసు విచారణ ప్రాథమిక స్థాయిలోనే ఉందని, త్వరలోనే కేసు వివరాలు అన్నీ వివరిస్తామన" అని క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్​ఛార్జ్​ అరవింద్​ చరణ్ చెప్పారు.

Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!

Advertisment
తాజా కథనాలు