Kasturi: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!

కొంతకాలం క్రితం తెలుగువారి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కస్తూరి మరోసారి నోరు పారేసుకున్నారు. తాజాగా ఆమె త‌మిళ‌నాడు కీల‌క పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల‌ను ఉద్దేశిస్తూ ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా రెండాకుల గుర్తే 60 ఏళ్లు నుంచి ఉందని అన్నారు.

New Update
Actress Kasthuri

Kasturi: ఇటీవ‌ల తెలుగువారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరి కొంతకాలం పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై పలు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌స్తూరి ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కీల‌క పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల‌ను ఉద్దేశిస్తూ రాష్ట్రంలో ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా రెండాకుల గుర్తే 60 ఏళ్లు నుంచి ఉందని అన్నారు. 

Also Read: మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవపై పోలీసుల వివరణ.. జరిగింది ఇదేనట

ఇక కొత్త‌గా టీవీకే పార్టీ స్థాపించిన న‌టుడు విజ‌య్ ఇంకా పార్టీ గుర్తు తీసుకోలేద‌ని, ఆయ‌న ఏ చిహ్నం తీసుకుంటున్నారో తనకు తెలియ‌ద‌న్నారు.ఓ పార్టీ కూట‌మికి వ్య‌తిరేకంగా అన్నీ పార్టీలు వేర్వేరుగా  పోరాడుతున్నాయ‌ని, కానీ అలా కాకుండా అవ‌న్నీ కూడా ఒకే గొడుగు కిందికి రావాల‌ని క‌స్తూరి అన్నారు.

Also Read: మంచు ఫ్యామిలీ కొట్లాటలో బిగ్ ట్విస్ట్.. మనోజ్ ఇంటికి విష్ణు

 తమ స‌మ‌స్య‌ల‌న్నింటికీ అధికార పార్టీనే కార‌ణ‌మ‌నే మాన‌సిక‌స్థితికి ప్రజలు వ‌చ్చేశార‌న్నారు. ఇక తాను జైలుకు వెళ్లిన‌ప్పుడు త‌న‌కు మ‌ద్ద‌తుగా మొద‌ట మాట్లాడిన వ్య‌క్తి సీమాన్ అని ఆమె తెలిపారు. అందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అయితే, సీమాన్‌ కూడా ఈసారి ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌నుకుంటున్నార‌ని క‌స్తూరి వివరించారు.

Also Read:'పుష్ప 2' స్క్రీనింగ్‌ లో వింత ఘటన.. డైరెక్ట్ సెకండాఫ్ వేయడంతో ఆడియన్స్ షాక్

జైలు జీవితం బాగుంది..

నటి కస్తూరిని కొద్ది రోజుల క్రితం అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే.దీని గురించి ఆమె మాట్లాడుతూ... ‘ఆదివారం అరెస్ట్‌ చేశారు. బుధవారం బయటకు వచ్చేశా. నేను జైలు లోపలికి వెళ్లక ముందే అక్కడున్న వారందరికీ నేను వస్తున్నానని తెలిసిపోయింది.

Also Read: నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్

 ‘స్టాలిన్‌ ఈమెను లోపలికి పంపాడట’ అని వాళ్లు అనుకుంటూంటే నేను విన్నాను. అక్కడ నాకు ఒక స్పెషల్‌ సెల్‌ ఇచ్చారు. తొలిసారి వచ్చిన ఖైదీలందరూ దానిలోనే ఉంటారట. నాకు కొత్త పళ్లెం, కొత్త లోటా ఇచ్చారు. జైలు సిబ్బంది బాగా చూసుకున్నారు. ఇక్కడో విషయం చెప్పాలి. జైలు జీవితం సినిమాలో చూపించినట్లు ఉండదు. నేను అనేక సినిమాల్లో, సీరియల్స్‌లో జైలు సీన్లు చేశాను. కానీ నిజమైన జైలు వేరేలా ఉంది.

మరో విషయం ఏమిటంటే... తమిళ ‘బిగ్‌బాస్‌’లోకి నేను ఒకసారి స్పెషల్‌ ఎంట్రీగా వెళ్లాను. ఆ సమయంలో ‘బిగ్‌బాస్‌ జైలు’లో ఉండాల్సి వచ్చింది. వాస్తవానికి అక్కడ కన్నా నిజమైన జైలులోనే బాగుంది. నిజమైన జైలులో ప్రమాదకరమైన వారు ఉంటారు. అమాయకులు కూడా ఉంటారు. జైలుకు వెళ్తున్నప్పుడు మొదట్లో నాకు అవమానంగా అనిపించింది. కానీ నా స్నేహితులు... ‘నువ్వు నేరం చేసి జైలుకు వెళ్లలేదు.. ఒక సిద్ధాంతం కోసం వెళ్తున్నావు’ అన్నారు. 

నిజమే కదా అని అనిపించింది. ఇక్కడొక విషయం చెప్పాలి. నేను జైలుకు వెళ్లకపోతే నా తెలుగు కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో తెలిసి ఉండకపోయేది. ఆ విధంగా చూస్తే నాకు మంచే జరిగింది..’’ అని చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు