Telangana: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో డిసెంబర్ 15వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని చెప్పారు. అది రానున్న 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశాలున్నాయని సమాచారం. Also Read: US: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్! ఈనెల 11 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 15 వరకు ఏపీతో పాటుగా తెలంగాణలోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయన్నారు.ఇక అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. Also Read: TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన టీటీడీ ఈవో! కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం పడింది. Also Read: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా చలిగాలుల తీవ్రత కూడా.. ఆదివారం తెల్లవారుజామున.. ఎస్‌ఆర్ నగర్, బేగంపేట, కూకట్‌పల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట, నాంపల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈరోజు కూడా ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంది. ఉదయం పూట చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. గత వారం రోజులుగా సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు దిగువకు పడిపోయాయి. Also Read: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు! ఉదయం పొగమంచు కూడా దట్టంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.