Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు ప్రకటించాయి.మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు ' కొన్ని విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి.

New Update
siriya

Syria: తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ దేశాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అసద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు ప్రకటించాయి. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. '' సిరియా అధ్యక్షుడు అసద్‌ తన కుటుంబంతో సహా మాస్కోకు చేరుకున్నారు. మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు ' కొన్ని విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి.

Also Read: మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

ఈ విషయం తో అసద్‌ ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్లారు ? అనే సందేహాలకు దీంతో తెరపడింది. అంతకు ముందు అసద్‌ ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్‌ కూల్చివేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తిరుగుబాటు దళాలతో చర్చల తరువాతే బషర్‌ సిరియాను విడిచి వచ్చారని రష్యా పేర్కొంది. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారని , అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది.

Also Read: యుద్ధంలో 43 వేల మంది సైనికులను కోల్పోయాం, శాంతి కావాలి: జెలెన్స్కీ

ఐదు దశాబ్దాల పాలనకు..

అయితే ఆయన ఏ దేశానికి వెళ్లారు అనేది మాత్రం చెప్పలేదు. దీంతో ఆయన ప్రయాణం పై రోజంతా పలు ఊహాగానాలు వచ్చాయి. డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడంతో సిరియాలో సంబరాలు మొదలయ్యాయి. అధ్యక్షుడు అసద్‌ దేశాన్ని విడిచి వెళ్లారని దీంతో ఐదు దశాబ్దాల పాలనకు తెరపడిందని రెబల్స్‌ ప్రకటించారు. మరోవైపు డమాస్కస్‌ లోని అధ్యక్షుడి విలాసవంతమైన ఆయన  ఇంటివద్దకు ప్రజలు తరలి రావడంతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులను కొందరు ఎత్తుకెళ్లారు.

Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. చదవని మెస్సేజ్‌లను గుర్తుచేస్తోందట!

అధ్యక్షుడి నివాసానికి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో అధ్యక్షుడి నివాసానికి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో అధ్యక్షుడి నివాసంలో పలు గదులు ఖాళీగా కనిపించాయి. కొన్ని గదుల్లో ఫర్నీచర్‌ ఉంది. అధ్యక్ష భవన ప్రాంగణంలోని ఒక హాల్‌ను కొందరు తగలబెట్టారు. కొందరు డమాస్కస్‌ లోని రోడ్ల పైకి చేరుకొని చీర్స్‌ చెబుతూ కనిపించారు. 

Also Read: ఆన్‌లైన్‌లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు

ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నాం. ఈ క్షణాన్ని నమ్మలేకపోతున్నా అని ఓ వ్యక్తి కన్నీళ్లతో అన్నాడు.ఇక నుంచి సరియా కొత్త చరిత్రను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు